రన్నింగ్‌ కోచ్‌ జీవితాన్ని కాపాడిన స్మార్ట్‌వాచ్‌..! 

8 Aug, 2021 17:06 IST|Sakshi

వాషింగ్టన్‌: మానవుడి నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు ఒక భాగమైయ్యాయి. కోవిడ్‌-19 రాకతో స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌ గణనీయంగా పెరిగింది. కోవిడ్‌ సమయంలో స్మార్ట్‌ వాచ్‌లు ఆక్సిజన్‌ లెవల్స్‌ను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. స్మార్ట్‌వాచ్‌లు యూజర్లకు అనేక విధాలుగా రక్షణను కల్పిస్తున్నాయే ఉన్నాయి. గతంలో ఓ మహిళను కిడ్నాపర్ల చెర నుంచి కాపాడటం.., పల్స్‌ పడిపోతున్న మహిళను కాపాడిన స్మార్ట్‌వాచ్‌ అంటూ అనేక వార్తలను చదివే ఉంటాం.

తాజాగా  ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ రన్నింగ్‌ కోచ్‌ను ప్రాణపాయ పరిస్థితుల నుంచి కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూయర్క్‌కు చెందిన 25 ఏళ్ల బ్రాండన్‌ ష్నైడర్‌ ఒక రన్నింగ్‌ కోచ్‌.  తన కోచింగ్‌ను ముగించుకుని బాత్రూమ్‌లో ఫ్రేష్‌ అవుతున్న సందర్బంలో బ్రాండన్‌ పల్స్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఆపిల్‌ వాచ్‌లో ఉన్న ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌తో వెంటనే అతని బంధువులను అలర్ట్‌ చేసింది. బంధువులు వెంటనే స్పందించి బ్రాండన్‌ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

బ్రాండన్‌కు పరీక్షలు చేయగా అతని మెదడులో రక్త గడ్డకటిన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అందువల్లనే బ్రాండన్‌ స్పృహ తప్పి పడిపోయారని పేర్కొన్నారు. కాగా డాక్టర్లు  వెంటనే అతడికి ఆపరేషన్‌ చేసి ప్రాణపాయ పరిస్ధితుల నుంచి కాపాడగల్గిగారు. ఈ విధంగా ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లో ఉన్న సడన్‌ ఫాల్‌ ఫీచర్‌ బ్రాండన్‌ ప్రాణాలను కాపాడింది. ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను 2018లో ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌ సిరీస్‌ 4 లో తొలిసారిగా ఆపిల్‌ పరిచయం చేసింది. 

మరిన్ని వార్తలు