కొత్త సిరీస్‌ లాంచ్‌ తరువాత పాత సిరీస్‌కు ఆపిల్‌ గుడ్‌బై!

5 Sep, 2022 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ:  టెక్ దిగ్గజం  ఆపిల్‌  మరో సంచలన నిర్ణయం తీసుకోనుందిట. సెప్టెంబరు 7న నిర్వహించనున్న గ్లోబల్‌ ఈవెంట్‌ ఆపిల్‌ కొత్త మోడల్‌ సిరీస్‌ వాచెస్‌ లాంచ్‌ కాగానే  పాత సిరీస్‌ను నిలిపివేయనుందని తెలుస్తోంది.   ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్‌లు త్వరలో నిలిపియనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా  మార్కెట్‌లో వీటి  విక్రయాలను నిలిపివేయనుందట.రాబోయే watchOS 9  Apple Watch Series 3కి సపోర్ట్‌ చేయని కారణంగా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతున్న ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్స్‌ను త్వరలో ఆపివేస్తుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికా,వాచ్‌ సిరీస్ 3 కాన్ఫిగరేషన్‌లలో మూడు ప్రస్తుతం యూకే ఆస్ట్రేలియాలో స్టాక్‌లో లేవనీ, అమెరికా స్టోర్‌లో  సిరీస్ 3 మోడల్ అందుబాటులో లేవని  MacRumors  రిపోర్ట్‌ చేసింది.

2017లో ఆపిల్‌ వాచ్ సిరీస్ 3ను లాంచ్‌ చేసింది. కాగా కరోనా మహమ్మారి రెండేళ్ల తరువాత యుఎస్‌లోని ఆపిల్ కుపెర్టినో క్యాంపస్‌లో మెగా ఈవెంట్‌ నిర్వహించనుంది. ఇందులో నాలుగు ఐఫోన్‌ 14 మోడల్స్‌తోపాటు, వాచెస్‌, ఇతర ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తోందని అంచనా. ముఖ్యంగా వాచెస్‌ సిరీస్‌ 8, వాచ్‌ ప్రో,  హై-ఎండ్ సిరీస్ 8 మోడల్, సెకండ్‌ జనరేషన్‌ ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఈని లాంచ్‌ చేయనుందని ఊహాగానాలున్నాయి. 

మరిన్ని వార్తలు