భారత్‌లో ప్రారంభమైన యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 అమ్మకాలు

2 Oct, 2020 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ యాపిల్‌ గత నెల రెండు కొత్త స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6తోపాటు వాచ్‌ సిరీస్‌ఎస్‌ఈను ప్రకటించింది. అమెరికాలో వీటి అమ్మకాలు సెప్టెంబర్ 18నే ప్రారంభం కాగా తాజాగా భారత్‌లో ఈ వాచ్‌ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రముఖ బ్యాంకులు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. (రిలయన్స్‌ డిజిటల్‌లో యాపిల్‌ వాచ్‌ న్యూ సిరీస్‌ 6 లాంఛ్‌)

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 ధర
ఇది రెండు 40 ఎంఎం, 44 ఎంఎం సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. జీపీఎస్‌ వేరియంట్‌ను బట్టి  40 ఎంఎం కేన్‌ ఉన్న ధర రూ. 40,900 కాగా 44 ఎంఎం కేన్‌ ఉన్న ధర రూ. 43,900గా నిర్ణయించారు.ఇందులో జీపీఎస్+సెల్యులార్ ఆప్షన్ కూడా ఉంది. దీని ధర రూ.49,990(40ఎంఎం)...రూ. 52,900(44ఎంఎం)గా ఉంది. (ఫెస్టివ్ సీజన్ : త్వరలో ఐఫోన్12 )

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 ఆఫర్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ ద్వారా యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6ను కొనుగోలు చేస్తే లాంచ్‌ ఆఫర్లతోపాటు తక్షణ 3 వేల రుపాయాల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే డెబిట్‌ కార్డు ద్వారా చేస్తే 1500 రూపాయల డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ప్రైమ్‌ మెంమర్స్‌ అమెజాన్‌పేతో కొనుగోలు చేస్తే ఫ్లాట్‌ 5% తక్షణ డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ప్రైమ్‌ మెంబర్‌ కాని వారికి 3% డిస్కౌంట్‌ ఉంది. 

యాపిల్ వాచ్ ఎస్ఈ ధర
ఇందులో కూడా  రెండు 40 ఎంఎం, 44 ఎంఎం సైజులు అందుబాటులో ఉన్నాయి. జీపీఎస్‌ వేరియంట్‌ను బట్టి 40 ఎంఎం కేన్‌ ధర రూ. 29,900 ఉంండగా 44 ఎంఎం కేన్‌ ధర రూ. 32,900 ఉంది. జీపీఎస్ + సెల్యులార్ వేరియంట్ ధరను బట్టి రూ.33,900(40ఎంఎం) అలాగే 36,900(ఎంఎం)గా నిర్ణయించారు. 

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ ఎస్‌ఈ ఆఫర్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ ద్వారా యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ ఎస్‌ఈను కొనుగోలు చేస్తే లాంచ్‌ ఆఫర్లతోపాటు తక్షణ 2 వేల రుపాయాల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే డెబిట్‌ కార్డు ద్వారా చేస్తే 1500 రూపాయల డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. హెచ్‌ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్‌ లభించనుంది. ఇంకేందుకు ఆలస్యం కావాలి అనుకునే వారు కొనేయండి.

మరిన్ని వార్తలు