Apple Watch Series 7: ఆపిల్‌ వాచ్‌ సేల్స్‌ ప్రారంభం..ఫీచర్లు మాములుగా లేవుగా!

15 Oct, 2021 13:45 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. దసరా సందర్భంగా ఇండియాలో ఆపిల్‌ వాచ్‌ 7సిరీస్‌ అమ్మకాల్ని ప్రారంభించింది. యాపిల్‌ ఈ ఏడాది 'యాపిల్‌ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫిరెన్స్‌'ను నిర్వహించింది.‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌’ ద్వారా సెప్టెంబర్‌ 14న నిర్వహించిన ఈవెంట్‌లో ఆపిల్‌ వాచ్‌ 7సిరీస్‌ను విడుదల చేయగా..దసరా పండుగ సందర్భంగా వాచ్‌పై ఆపిల్‌ అమ్మకాల్ని ప్రారంభించింది. 

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7 ఫీచర్లు 
ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌7 41ఎంఎం అండ్‌ 45 ఎంఎం సైజ్‌, రెటీనా డిస్‌ప్లే, 1.7ఎంఎం థిన్‌ బెజెల్స్‌ ఫీచర్లు ఉన్నాయి. డబ్ల్యూఆర్‌ 50 వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌, క్వర్టీ  కీబోర్డ్‌తో వస్తుంది. ఇక ఈ వాచ్‌ను 45 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చుని ఆపిల్‌ తెలిపింది. యూఎస్‌బీ -సీ ఛార్జింగ్‌ కేబుల్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.క్వర్టీ కీబోర్డ్ యాపిల్ వాచ్ సిరీస్ 6 మాదిరిగానే, ఆపిల్ వాచ్ సిరీస్ 7లో బ్లడ్ ఆక్సిజన్ (SpO2), ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్‌లు ఉన్నాయి. ఈ సెన్సార్ల ఆధారంగా హార్ట్‌ ట్రాకింగ్‌ ఈజీ అవుతుంది.  

  

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7 ధరలు 
భారత్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రారంభ ధర రూ. 41,900కే లభించనుంది. 41ఎంఎం సైజ్‌  వేరియంట్‌లో అల్యూమినియం కేస్‌, జీపీఎస్‌ సెల్యూలర్‌ వెర్షన్‌ మోడల్ ధర రూ. 50,900కే అందుబాటులో ఉంది. 45 ఎంఎం వేరియంట్‌ ధర రూ. 44,900, 45 ఎంఎం సైజ్‌లో జీపీఎస్‌ ప్లస్‌ సెల్యులర్‌ ధర రూ.53,900గా ఉంది. అల్యూమినియం కేస్‌ ఆప్షన్‌, స్పోర్ట్స్‌ బ్యాండ్‌తో స్టైన్‌ లెస్‌ స్టీల్‌ కేస్‌తో ఉన్న వాచ్‌ ధర రూ.69,900గా ఉంది. ఇక  మిలనీస్ లూప్ స్ట్రాప్‌తో స్టెయిన్లెస్ స్టీల్ కేస్‌ ధర రూ. 73,900గా ఉంది.  టైటానియం కేస్‌లో లెదర్ లింక్ స్ట్రాప్‌తో  ఉన్న వాచ్‌ ధర రూ. 83,900గా ఉందని ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ పోర్టల్‌లో అధికారికంగా తెలిపింది. 

డిస్కౌంట్స్‌, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్‌
ఆపిల్‌ ఆథరైజ్డ్‌ డిస్టిబ్యూటర్స్‌, రీసెల్లర్‌ స్టోర్స్‌, ఇతర ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లలో ఈ ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌7 కొనుగోలపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.3వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ పొందవచ్చు. ఇక కొన్ని స్టోర్‌లలో రూ.9వేల వరకు ఎక్ఛేంజ్‌ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు