ఆపిల్‌ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?!

21 Aug, 2021 14:20 IST|Sakshi

మీరు ఆపిల్‌ ప్రాడక్ట్‌ లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెప్టెంబర్‌ 14, 15 తేదీలలో (అంచనా) ఆపిల్‌ సంస్థ 'వరల్డ్‌ డెవలపర్‌ కాన్ఫిరెన్స్‌' (wwdc) 2021 ఈవెంట్‌ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో భారీ ఎత్తున కొత్త ప్రాడక్ట్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

బ్లూమ్‌ బెర్గ్‌ కథనం ప్రకారం..ఆపిల్‌ సంస్థ ప్రతి ఏడాది డెవలపర్‌ కాన్ఫిరెన్స్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.ఈ ఈవెంట్‌లో విడుదల చేయబోయే ఉత్పత్తుల గురించి అనౌన్స్‌ చేస్తుంది. వచ్చే నెలలో జరగనున్న ఈవెంట్‌లో యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌, ఐపాడ్‌ మినీ 6, ఆపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ 3, ఐపాడ్‌ మినీ 6 విడుదల చేయనున్నట్ల బ్లూమ్‌ బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. పై ప్రాడక్ట్స్‌తో పాటు గతేడాది వరల్డ్‌ డెవలపర్‌ కాన్ఫిరెన్స్‌ 2020లో విడుదల కాకుండా ఆగిపోయిన ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6, ఐపాడ్స్‌ను విడుదల చేయనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ఐఫోన్ 13


ఐఫోన్ 13లో కొన్ని ముఖ్యమైన డిజైన్, హార్డ్‌వేర్ లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రిమ్డ్‌ డౌన్‌ డిస్‌ప్లే నాచ్‌, ఫేస్-ఐడి కాంపోనెంట్‌లను యాడ్‌ చేయనుంది. ఫేస్ ఐడి సిస్టమ్‌లో వీఎస్‌సీఈఎల్‌ (Vertical-cavity surface-emitting laser) చిప్‌ని జోడించడం, ఐఫోన్‌ 13ప్రో, ఐఫోన్‌ 13ప్రో మ్యాక్స్‌ లలో 120 హెచ్‌ జెడ్‌ ఎల్‌టీపీఓ డిస్ ప్లేలు, లార్జ్‌ సైజ్‌ బ్యాటరీతో రిలీజ్‌ చేయనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా. ప్రస్తుతం ఐఫోన్‌ 12 మోడల్‌కు 512జీబీ స్టోరేజ్‌ను అందిస్తుండగా ఐఫోన్‌13 ను 1టెరాబైట్‌ స్టోరేజ్‌తో అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఐఫోన్‌ 13 వివరాలు అందుబాటులో ఉండగా.. మిగిలిన ప్రాడక్ట్‌ల వివరాలను ఆపిల్‌ సం‍స్థ పూర్తి స్థాయిలో రివిల్‌ చేయలేదు.

చదవండి : వాట్సాప్‌లో మరో ఫీచర్‌, ఇకపై ఐపాడ్‌లో కూడా

మరిన్ని వార్తలు