April Auto Sales: కార్లు.. కుయ్యో.. మొర్రో, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు!

2 May, 2022 12:03 IST|Sakshi

ముంబై: ఆటో పరిశ్రమ సప్లై సమస్యలతో సతమతమవుతోంది. దీనితో ఉత్పత్తి తగ్గి, కార్ల తయారీ కంపెనీల ఏప్రిల్‌ అమ్మకాలు క్షీణించాయి. ముఖ్యం గా దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకి, హ్యూందాయ్‌ కార్ల హోల్‌సేల్‌ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. 

అయితే టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, స్కోడా ఆటో కంపెనీలు గత నెల మెరుగైన అమ్మకాల వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకి గతేడాది ఏప్రిల్‌ కంటే ఈసారి ఏడు శాతం తక్కువగా 1,32,248 యూనిట్లను విక్రయించింది. ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

హ్యూందాయ్‌ సైతం సమీక్షించిన నెలలో పది శాతం క్షీణతతో 44,001 యూనిట్లను విక్రయించింది. హోండా కార్స్‌ కంపెనీ అమ్మకాలు ఏప్రిల్‌ 7,874 యూనిట్లతో 13 % పడిపోయా యి. ‘‘వినియోగదారుల నుంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ సరఫరా సమస్య తీవ్రంగా ఉందని, అందుకే అమ్మకాలు నెమ్మదించాయి’’ అని హోండా మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ డైరెక్టర్‌ యుచి మురాటా అన్నారు. 

చదవండి👉 ట్విటర్‌ ఎఫెక్ట్‌: టెస్లాకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు