ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..!

6 Oct, 2021 17:42 IST|Sakshi

2 Trillion Company Is Making A Fortune Out Of Soaring Oil Prices : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నీ తాకుతున్నాయి.ఇంధన ధరలు సామాన్యులకు షాక్‌ ఇస్తూంటే సౌదీ కంపెనీకి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. 

మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌ కంపెనీలకే పోటీగా...
సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆరామ్‌కో బుధవారం రోజున ట్రేడింగ్ సమయంలో సరికొత్త రికార్డులను నమోదుచేసింది. ఆరామ్‌కో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలుగా నిలిచిన  మైక్రోసాఫ్ట్, ఆపిల్‌ కంపెనీలకు పోటీగా ఆరామ్‌కో అడుగులు వేస్తోంది. ప్రపంచంలో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కల్గిన మూడో కంపెనీగా ఆరామ్‌కో నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏడు సంవత్సరాల్లో గరిష్టంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా పెరిగాయి. 
చదవండి: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్‌ ఎప్పుడంటే..

ముడిచమురుకు భారీ డిమాండ్‌..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురుపై భారీ డిమాండ్‌ నెలకొంది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరామ్‌కోలో అధిక వాటాలను కల్గి ఉంది. సౌదీ తడావుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బహిరంగంగా జాబితా చేయబడిన కంపెనీలో కేవలం 2% కంటే తక్కువ వాటాలను ఆరామ్‌కో  కల్గిఉంది.  2019 చివరలో ఆరామ్‌కోలో కొంత భాగాన్ని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్టాక్‌ఎక్సేఛేంజ్‌లో లిస్ట్‌ చేసేలా చేశారు.ఆయిల్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి కూడా గణనీయమైన లాభాలను పొందుతున్నారు. 
చదవండి: నిన్న ప్రధానితో నేడు ఆర్థిక మంత్రితో ఝున్‌ఝున్‌వాలా భేటీ, నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటీ ?

మరిన్ని వార్తలు