SC Notice To MS Dhoni: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్‌  

26 Jul, 2022 11:59 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి  భారీ షాక్‌  తగిలింది. ధోనీ అభ్యర్థనమేరకు ఆమ్రపాలి గ్రూప్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ధోనీకి నోటీసు జారీ చేసింది.  ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది.

యూయూ లలిత్, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆమ్రపాలి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. ఆమ్రపాలి గ్రూప్ పాత యాజమాన్యం మధ్య వర్తిత్వ  ప్రక్రియలో గృహ కొనుగోలుదారులకు న్యాయం జరగాలని  వ్యాఖ్యానించారు.

ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా తన సేవలకు చెల్లింపులో డిఫాల్ట్ అయ్యారంటూ ఆమ్రపాలి గ్రూపుపై మధ్యవర్తిత్వ చర్యలు కోరుతు కోర్టును ఆశ్రయించాడు. ధోనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఎమ్‌పిఎల్)తో ఆమ్రపాలి గ్రూప్ ‘షామ్ ఒప్పందాలు’ కుదుర్చుకునిఇంటి కొనుగోలుదారులసొమ్మును అక్రమంగా మళ్లించిందని అత్యున్నత న్యాయస్థానం నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు ధర్మాసనానికి తెలిపారు. 

కాగా 2019, మార్చిలో ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్ట్‌లో 10 సంవత్సరాల క్రితం బుక్ చేసిన 5,500 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌పై తన యాజమాన్య హక్కులను కాపాడాలని కోరుతూ సుప్రీం కోర్టు తలుపు తట్టాడు ధోని. రియల్ ఎస్టేట్ కంపెనీకి తన సేవలకు సంబంధించి రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్‌పై మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది. ఆమ్రపాలి, దాని డైరెక్టర్లు ఉపయోగించని ఆస్తులను విక్రయించడం ద్వారా 700 కోట్ల రటపాయల నిధిని ఎలా ఏర్పాటు చేయవచ్చో అన్వేషించాలని నోయిడా ,గ్రేటర్ నోయిడా అధికారులను కోర్టు కోరింది. కొనుగోలుదారులపై అనవసరంగా భారం పడకూడదని పేర్కొంటూ, ప్రాజెక్టుల నిర్మాణానికి లోటును తీర్చేందుకు గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్‌ల కోసం చదరపు అడుగుకు రూ. 200 చొప్పున అదనపు మొత్తాన్ని జమ చేయాలనే ఎస్సీ నియమించిన రిసీవర్ ప్రతిపాదనను కోర్టు మళ్లీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా?

మరిన్ని వార్తలు