Corona Crisis: ఎంట్రన్స్‌ టెస్ట్‌ లేకుండా యూరప్‌లో చదివే ఛాన్స్‌ !

28 Jun, 2021 13:51 IST|Sakshi

పోర్చుగల్‌లో స్థిర నివాసానికి అవకాశం

రూ. 3.09 కోట్లు పెట్టుబడి పెడితే చాలు

ఇన్వెస్టర్లకు ఆహ్వానిస్తోన్న అరేతా సంస్థ

జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు ఆఫర్‌ 

వెబ్‌డెస్క్‌ : కరోనా ఇంకా కంట్రోల్‌లోకి రాకపోవడంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. వ్యాక్సినేషన్‌లో ముందున్న యూఎస్‌, యూరప్‌ దేశాలకు తమ పిల్లల్ని పంపే ప్రణాళికలో సంపన్న వర్గాల ప్రజలు ఉన్నారు. ఇలాంటి వారి కోసం పొర్చుగల్‌ దేశానికి చెందిన అరేతా పోర్చుగల్‌ విజన్‌ ఫండ్‌ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. 

అక్కడే స్థిర నివాసం
యూరప్‌లో రియల్‌ రంగంలో వ్యాపారం చేస్తోన్న అరేతా పోర్చుగల్‌ విజన్‌ ఫండ్‌ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెడితే పోర్చుగల్‌లో పర్మినెంట్‌గా నివసించే అవకాశం కల్పిస్తామంటూ తెలిపింది.  అ అవకాశం పొందాలంటే  ఈ సంస్థలో 3,50,000 యూరోలు అంటే  మన కరెన్సీలో రూ. 3.09 కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 2021 జులై 1 నుంచి ఈ స్కీం ప్రారంభించనున్నట్టు ఆరేతా సంస్థ  సీఈవో ఆశీష్‌ సరాఫ్‌ ప్రకటించారు. 

చదువు ఒకే 
పర్మినెంట్‌ నివాసానికి సంబంధించిన గోల్డెన్‌ వీసా ఉంటే అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి. పోర్చుగల్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్నాళ్లైన అక్కడే నివసించవచ్చు. దీంతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో సభ్య దేశాల్లోకి రాకపోకలు సుళవు అవుతుంది.  ఎంట్రన్స్‌లు, టెస్టులు తదితర వ్యవహరాలు లేకుండా ఈయూ దేశాల్లో చదువుకొవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, ఓటు హక్కు వంటి ప్రయోజనాలు అందవు.

యూరప్‌ క్రేజ్‌
ఎంత స్వదేశీ అభిమానం మనలో ఉన్నా .... యూరోపియన్‌ లైఫ్‌ స్టైల్‌ అన్నా అక్కడి వాతవరణ పరిస్థితులు అన్నా ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా సంపన్న వర్గాల వారికి యూరప్‌ అంటే వల్లమానిన అభిమానం. అందువల్లే కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది సంపన్న వర్గాల వారు విదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది యూరప్‌కే వెళ్లారు. 

గోల్డెన్‌ వీసా
2012లో పోర్చుగీసు ప్రభుత్వతం గోల్డెన్‌ వీసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం రూ. 3.09 కోట్లు పెట్టుబడులు పెట్టిన వారికి సులువుగా పోర్చుగల్‌లో నివసించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ గోల్డెన్‌ వీసా గడువు 2021 డిసెంబరుతో ముగియనుంది. కొత్త నిబంధనలతో తిరిగి 2022 జనవరి నుంచి ప్రారంభం కానుంది. అయితే పెట్టుబడి మొత్తం దాదాపు రెట్టింపు కానుంది. దీంతో జులై నుంచి డిసెంబరు వరకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థిర నివాసం అవకాశం అరేతా సంస్థ కల్పిస్తోంది . 

చదవండి : క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తోన్న భారతీయులు..!

మరిన్ని వార్తలు