బీపీసీఎల్‌ చైర్మన్‌గా అరుణ్‌కుమార్‌ సింగ్‌ బాధ్యతలు

9 Sep, 2021 02:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టారు.  2020 ఆగస్టులో డీ రాజ్‌కుమార్‌ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో ఈ ఏడాది మేనెల్లో సింగ్‌ నియామకం జరిగింది. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ జరిగి, కొత్త యాజమాన్యం వచి్చన తర్వాతే చైర్మన్‌ నియామకం జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తొలుత వర్తా లు వచ్చాయి.

రాజ్‌కుమార్‌ గత ఏడాది పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కే పద్మాకర్‌ (మానవ వనరుల విభాగం డైరెక్టర్‌) సంస్థ సీఎండీ అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీపీసీఎల్‌లో మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ సింగ్‌ను చైర్మన్‌గా ఎంపికచేస్తూ మే 10న ప్రభుత్వ రంగ సంస్థల నియామక వ్యవహారాల బోర్డ్‌ నిర్ణ యం తీసుకుంది. ఈవారం మొదట్లో ఆయన ని యామకానికి కేబినెట్‌ కమిటీ (నియామకాలు) ఆ మోదముద్ర వేసింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పరిశ్రమ లో సింగ్‌కు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.  

ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా రామకృష్ణ గుప్తా
దేశంలో అతిపెద్ద రెండవ ఇంధన మార్కెటింగ్‌ కంపెనీ కొత్త డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా వేత్స రామకృష్ణ గుప్తా పదోన్నతి పొందారు. ప్రస్తుతం బీపీసీఎల్‌ సీఎఫ్‌ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న పదవీ విరమణ చేసిన ఎన్‌. విజయగోపాల్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. బీపీసీఎల్‌లో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. అనిల్‌ అగర్వాల్‌సహా మూడు గ్రూప్‌లు కొనుగోలుకు ‘‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’’ దాఖలు చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే వాటా అమ్మకాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, కరోనా వల్ల ఈ ప్రయత్నాలు ఆలస్యం అయ్యాయి.

మరిన్ని వార్తలు