ఐరన్‌ లెగ్‌ అశ్నీర్‌ గ్రోవర్‌, జొమాటో నష్టానికి ఈయనే కారణమా!

26 Jul, 2022 15:17 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ప్రముఖ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌ జొమాటో షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో జొమాటో 14శాతం షేర్లు పడిపోయి రూ.46 వద్ద జీవిత కాల కనిష్ఠాన్ని తాకాయి. చివరకు 11.28 శాతం నష్టంతో రూ.47.60 వద్ద ముగియగా..దీంతో నిన్నఒక్కరోజే జొమాటో రూ.1000కోట్లు (అంచనా) నష్టపోయింది.మంగళవారం సైతం ఆ సంస్థకు నష్టాల పరంపర కొనసాగుతుంది. 

ఇవ్వాళ మార్కెట్‌ కొనసాగే 2.50గంటల సమయానికి ఎన్‌ఎస్‌ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోయి రూ.42.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ తరుణంలో భారత్‌ పే మాజీ ఫౌండర్‌ అ‍శ్నీర్‌ గ్రోవర్‌ స్పందించారు. జొమాటో- స్విగ్గీలు మెర్జ్‌ అయితే జొమాటో షేర్‌ రాకెట్‌ వేగంతో రూ.450కి చేరుతుందని ట్విట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా.. జొమాటో షేర్లు నష్టపోవడానికి అశ్నీరే అంటూ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   

ఐరన్‌ లెగ్‌ అశ్నీర్‌ 
 జొమాటో షేర్ల పతనానికి అశ్నీర్‌ గ్రోవరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే? ఫినెట్‌క్‌ కంపెనీ భారత్‌ పే'ను స్థాపించిన అశ్నీర్‌ గ్రోవర్‌, ఆయన భార్య మాధురీ జైన్‌లపై సంస్థ నిధుల్ని కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన అల్వరెజ్‌ అండ్‌ మార్షల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ సైతం... అశ్నీర్‌, మాధురీ జైన్‌ కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది.

అశ్నీర్‌ రాజీనామా
దీంతో భారత్‌పే మాధురీ జైన్‌ను విధుల నుంచి తొలగించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అశ్నీర్‌ సైతం భారత్‌పేలో తన పదవికి రాజీనామా చేశారు. తనపై కుట్ర చేశారని, ఎలాంటి తప్పు చేయలేదంటూ వాదనకు దిగారు. చివరకు చేసేది లేక భారత్‌ పే నుంచి బయటకు వచ్చిన అశ్నీర్‌ తన కుటంబ సభ్యులకు చెందిన అమెరికన్‌ కంపెనీతో కలిసి మరో స్టార్టప్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

అప్పుడు భారత్‌పే.. ఇప్పుడు జొమాటో
ఇక భారత్‌ పేతో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్ధిక సమస్యల నుంచి బయట పడేందుకు అశ్నీర్‌ తన కిరాణ డెలివరీ యాప్‌ సంస్థ బ్లింకిట్‌ను జొమాటోకు అమ్మేశారు. జొమాటో రూ. 4,447 కోట్ల డీల్‌తో షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకుంది. దీంతో బ్లింకిట్‌ అశ్నీర్‌ది కావడం, ఇప్పటికే భారత్‌పే నిధుల్ని కాజేయడం వంటి ఇతర కారణాల వల్ల జొమాటో మదుపర్లు అప్రమత్తమయ్యారు. జొమాటో షేర్లను అమ్మేసిస్తున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి.

చదవండి: అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు!

మరిన్ని వార్తలు