ఏషియన్‌ పెయింట్స్‌ లాభం జూమ్‌

21 Jul, 2021 00:48 IST|Sakshi

క్యూ1లో రూ. 574 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 574 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 220 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 91 శాతం జంప్‌చేసి రూ. 5,585 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ. 2,923 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. కాగా.. మొత్తం వ్యయాలు 26 శాతం పెరిగి రూ. 1,006 కోట్లకు చేరాయి. దేశీయంగా డెకొరేటివ్‌ బిజినెస్‌ అమ్మకాల పరిమాణం రెట్టింపైనట్లు ఎండీ, సీఈవో అమిత్‌ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పడిపోయినట్లు ప్రస్తావించారు.

షేరు దూకుడు...
ఫలితాల నేపథ్యంలో ఏషియన్‌ పెయింట్స్‌ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 3,145 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,179ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈలోనూ ఇదే స్థాయిలో ఎగసింది. ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈలో 67.55 లక్షలు, బీఎస్‌ఈలో 2.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు