ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ వాయు కాలుష్యం నుంచి రక్షిస్తుందా...!

4 May, 2021 16:37 IST|Sakshi

ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ మనలో చాలా మందికి సుపరిచితమే. ఒంట్లో కాస్త నలతగా ఉన్న, జ్వరం వచ్చిన, ఈ టాబ్లెట్‌ను వాడుతుంటారు. అంతేకాకుకుండా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నవారు డాక్టర్ల సూచన మేరకు ఉపయోగిస్తారు. కాగా పరిశోధకులు ఆస్పిరిన్‌ టాబ్లెట్‌పై నిర్వహించిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ ఉపయోగించడంతో ఒక్కింతా వాయు కాలుష్యం ప్రభావం నుంచి తప్పించుకోవచ్చునని పరిశోధకులు అధ్యయనంలో కనుగొన్నారు.

అధ్యయనం ప్రకారం నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్‌ ఆస్పిరిన్ తీసుకునే వృద్ధులు ​కొంతమేర వాయు కాలుష్యం వల్ల ఏర్పడే స్వల్పకాలిక ప్రభావాల నుంచి రక్షించబడతారని తెలిసింది. అమెరికాలో బోస్టన్ ప్రాంతంలో దాదాపు వెయ్యి మంది మగ వారిపై నిర్వహించిన ఈ పరిశోధనలో, ఆస్పిరిన్‌ తీసుకున్న వారిలో  కాలుష్యం ఒక మోస్తరుగా ఉన్న సందర్భంలో వారు ఊపిరి తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదని అధ్యాయనం వెల్లడించింది.

ఆస్పిరిన్ తీసుకోవడంతో మెదడు పనితీరుపై అది చూపే ఫలితాలను పరిశోధకులు కనుగొనలేకపోయారు. కానీ, నాన్‌ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీలను తీసుకుంటున్న వారికి నిర్వహించిన పరీక్షలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత విషయంలో వారు గణనీయమైన మార్పులను కనుగొన్నారు. వీరి అధ్యయనం ప్రకారం స్వల్పకాలిక వాయు కాలుష్యానికి బహిర్గతమైన వారిలో స్వల్పకాలిక మార్పులు సంభవించాయి. అధిక వాయు కాలుష్యం వలన వారిలో మెదడులో కొంత నొప్పి ఏర్పడింది. ఆస్పిరిన్‌ టాబ్లెట్‌ తీసుకున్న వారిలో కాలుష్యంవల్ల మెదడులో ఏర్పడే నొప్పి కాస్త తగ్గుతుందని తెలిపారు. దీంతో వారిలో క్రోనిక్‌ నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కల్గినట్లు పరిశోధకులు చేసిన స్టడీలో తేలింది.

కాగా ప్రస్తుతం ఇది ఒక పరికల్పన మాత్రమే.  వాయుకాలుష్యం నుంచి ఏర్పడే సమస్యలపై పెద్ద ఏత్తున క్లినికల్‌ స్టడీలు చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆస్పిరిన్‌ వాడకంతో వాయుకాలుష్య ప్రభావానికి వెంటనే చెక్‌ పెట్టలేము. ఈ టాబ్లెట్‌ను తక్కువ మోతాదులో తీసుకున్న అధిక మొత్తంలో రక్తస్రావం జరిగే చాన్స్ ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వాయుకాలుష్యానికి ఎక్కువగా గురైన వారిలో అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

తక్కువ స్థాయి వాయు కాలుష్యానికి గురైన వారిలో నాన్‌ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ తీసుకొనని వారిలో జ్ఞాపక శక్తి తగ్గుదల 128 శాతంగా ఉంది.  నాన్‌ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీలను తీసుకునే వారు ఇదే సమయంలో జ్ఞాపక శక్తి తగ్గుదల 44 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు