No Time Time To Die: గన్నులున్న జేమ్స్‌బాండ్‌ కారు.. అమ్మకానికి రెడీ !

21 Sep, 2021 13:47 IST|Sakshi

సీక్రెట్‌ ఏజెంట్‌ జేమ్స్‌బాండ్‌ స్టైలే వేరు. నడిచే తీరు నుంచి నడిపే కారు వరకు ప్రతీది ప్రత్యేకమే. బాండ్‌ సినిమాల్లో ఎంఐ6 ఏజెంట్‌ ఉపయోగించే కార్లలను సైతం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అలాంటి స్పెషల్‌ కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది.

ఇప్పటి వరకు  బాండ్‌ వాడే కార్లంటీని ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థనే తయారు చేసింది. త్వరలో విడుదల కాబోతున్న నో టైం టూ డై సినిమా  కోసం స్పెషల్‌ ఎడిషన్‌ కార్లను సిద్ధం చేసింది. డీబీ 5 జూనియర్‌ పేరుతో ఈ కార్లను తయారు చేస్తోంది.

రెగ్యులర్‌ కార్లతో పోల్చితే  జేమ్స్‌బాండ్‌ కార్లు జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ అన్నట్టుగా ఉంటాయి. శత్రువులపై పోరాడేందుకు వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా బాండ్‌ కార్లలో అధునాతమైన ఆయుధాలు, గ్యాడ్జెట్లు ఉంటాయి. డీబీ 5 జూనియర్‌లో కూడా ఇలాంటి గ్యాడ్జెట్లు వెపన్స్‌ పొందు పరిచారు.

జేమ్స్‌బాండ్‌ స్పెషల్ ఎడిషన్‌ డీబీ 5 జూనియర్‌లో డిజిటల్‌ నంబర్‌ ప్లేట్‌ను అమర్చారు. ఇందులో నంబర్లు ఆటోమేటిక్‌గా మారిపోతుంటాయి, అంతేకాదు స్విచ్చ్‌ నొక్కితే చాలు హెడ్‌లైట్ల స్థానంలో గన్స్‌ స్రత్యక్షం అవుతాయి. స్మోక్‌ స్క్రీన్‌, హిడ్డెన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థ ఎలక్ట్రిక్‌ కారుగా డీబీ 5 జూనియర్‌ని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 80 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు ధరని 90,000 డాలర్లుగా నిర్ణయించింది. ఈ కారు కావాల్సిన వారు ఆస్టోన్‌ మార్టిన్‌ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆస్టోన్‌ మార్టిన్‌ సంస్థ కేవలం 125 కార్లను మాత్రమే తయారు చేసింది. వీటిని ఆస్టోన్‌ మార్టిన్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వారికే కేటాయించనుంది. అయితే ఈ కార్లను సొంతం చేసుకున్నా ... రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి లేదు. 

బాండ్‌ తరహాలో వెపన్స్‌, లేటెస్ట్‌ గాడ్జెట్స్‌ ఉన్నందున వీటికి అనుమతి నిరాకరించారు. స్పెషల్‌ ఈవెంట్స్‌, రేస్‌ట్రాక్‌లపై నడుపుకోవచ్చు. సెలబ్రిటీలు, బిజినెస్‌ బ్యాగ్నెట్‌లు తమ గ్యారేజీలో అదనపు ఆకర్షణగా ఈ కార్లను ఉంచుకునేందుకు ఇష్టపడతారు.

చదవండి : సూపర్‌ కార్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌


 

మరిన్ని వార్తలు