International Space Station: అద్భుతం: 'లక్షల కోట్లను సేవ్‌ చేసిన టీ బ్యాగ్‌'

23 Oct, 2021 16:11 IST|Sakshi

మ‌నకో క‌ష్టం వ‌చ్చింది. ఆ క‌ష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే .. గ‌డ్డిపోచ‌ని సైతం బ్ర‌హ్మ‌స్త్రంగా మార్చుకోవ‌చ్చు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. వీళ్లు కూడా అదే చేశారు. అది భూమి మీద కాదు. భూమి నుంచి సుమారు 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేష‌న్‌లో. ఓ చిన్న టీ బ్యాగ్ లక్షల కోట్లకు పైగా నష్టాన్ని, అందులో ఉన్న ఆస్ట్రానాట్స్‌ ప్రాణాల్ని కాపాడగలిగింది. అదెలా అంటారా? 

వరుస ప్రమాదాలు


ఇటీవ‌ల కాలంలో అంత‌ర్జాతీయ‌ అంత‌రిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో వ‌రుస‌ ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాలం చెల్లిన హార్డ్‌వేర్, సిస్ట‌మ్స్ కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తతున్నాయి. అయినా ఆస్ట్రోనాట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ ప్ర‌మాదాల్ని నివారిస్తూనే ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. గ‌తేడాది అక్టోబర్‌ నెలలో స్పేస్ స్టేష‌న్‌లోని ఓ విభాగంలో రంధ్రం ప‌డింది. ఈ స్పేస్ స్టేష‌న్ ప్ర‌తి రోజూ భూమి చుట్టూ  15.5 సార్లు ప్ర‌యాణిస్తుంది. ఒక్కో క‌క్ష్య చుట్టి రావ‌డానికి 93 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. అయితే మాడ్యుల్‌లో ప‌డిన ఈ రంధ్రం వ‌ల్ల ప్ర‌తి రోజూ 250 గ్రాముల (0.6 పౌండ్ల) కంటే ఎక్కువ గాలిని కోల్పోయింది. 

లీక‌వుతున్న గాలిని ఎలా గుర్తించారు.


స్పేస్ స్టేష‌న్‌లో యూఎస్ఏ, జ‌పాన్‌, ర‌ష్యా, కెన‌డా, యూర‌ప్ దేశాల‌కు చెందిన ఆస్ట్రోనాట్స్ ప్ర‌యోగాలు చేస్తున్నారు. అయితే అదే సమ‌యంలో రంధ్రం ప‌డిన మ‌రుస‌టి రోజు స్పేస్ స్టేష‌న్‌కి ఏదో ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. వెంట‌నే స్పేస్ స్టేష‌న్‌లో ప్ర‌మాదాన్ని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. ప్రతి సెక్షన్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇలా ఒక్కోస్టేషన్‌లో ప్రమాదాన్ని గుర్తించేందుకు నాలుగురోజులు సమయం పట్టింది. అయినా వాళ్లకు నిరాశే ఎదురైంది. ఇక అన్ని మాడ్యుల్స్‌ను క్లోజ్‌ చేస్తూ చివరిగా స్పేస్‌ స్టేషన్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఉండే రష్యా ఆస్ట్రోనాట్స్‌ ఉండే విభాగం 'జ్వెజ్డా'లోకి వచ్చారు.

లక్షల కోట్ల నష్టం నుంచి గట్టెక్కించిన టీ బ్యాగ్‌


జ్వెజ్డా విభాగంలోకి వచ్చిన ఆస్ట్రోనాట్స్‌ కి అక్కడే లీకేజీ అవుతున్న విషయాన్ని గుర్తించారు. గుర్తించిన వెంటనే స్పేస్‌ స్టేషన్‌ ప్రమాదానికి గురవుతుందని, ప్రమాదం వల్ల జరిగే నష్టం గురించి ఇలా అనేక భయాలు ఆస్ట్రోనాట్స్‌ మెదడులను తొలిచివేస్తున్నాయి. అదే సమయంలో రష్యన్‌ ఆస్ట్రోనాట్ 'అనాటోలీ ఇవానిషిన్‌' కు మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిచన్‌ విభాగంలో ఉన్న టీ బ్యాగ్‌ ను తెచ్చు. వెంటనే అందులో ఉన్న టీ పొడిని రధ్రం పడిన ప్రాంతాన్ని కవర్‌ చేసేందుకు ప్రయత్నించారు. అద్భుతం. గాలి లీక్‌ అవ్వడం ఆగిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్స్‌ ఆ ప్రాంతాన్ని శాస్వతంగా కవర్‌ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరకు ప్రత్యేకంగా తయారు చేసిన ద్రావాన్ని ఆ హోల్‌లో పోసి సీల్‌ వేశారు. దీంతో లక్షల కోట్లకు పైగా విలువ చేసే స్పేస్‌ స్టేషన్‌ను, అందులో పనిచేస్తున్న ఆస్ట్రోనాట్స్‌  ప్రాణాల్ని కాపడగలిగారు. 

రంధ్రం పడితే ఏమవుతుంది 


నిపుణులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. స్పేస్‌ స్టేషన్‌కు రంధ్రం పడడం వల్ల లోపలి గాలి బయటకు విడుదలవుతుంది. ఆ సమయంలో స్పేస్‌ లోపల ఉన్న అంత‌రిక్షంలో ఉన్న‌పుడు వ్యోమ‌గాముల శ‌రీరంలో అనేక మార్పులు జ‌రుగుతాయి. కాళ్లలోని ఎముక‌లు, వెన్నెముకపై శ‌రీరబ‌రువు ప‌డదు. దాంతో కాల్షియం విడుద‌ల‌పై ప్ర‌భావం ప‌డి ఎముక‌లు, వెన్నుపూస విరిగే ప్రమాదం ఉంది. వీటితో పాటు రక్త ప్రసరణ ఇతర శరీర భాగాలకు వెళ్లకుండా ఆగిపోతుంది.  

ఐఎస్‌ఎస్‌..

అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను 1998లో ప్రారంభించారు. దీని విలువ భారత కరెన్సీ ప్రకారం లక్షకోట్లకు పై మాటే. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో నిర్వహించేందుకు ఈ కేంద్రాన్ని శాస్త్రవేత్తలు వినియోగించుకుంటుంటారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో 108 దేశాలకు చెందిన పరిశోధకులు 3 వేలకు పైగా పరిశోధనలు జరిపారు. మరి లక్షకోట్ల విలువైన స్పేస్‌ స్టేషన్‌ను ప్రమాదం నుంచి కాపాడేందుకు చాకిచక్యంగా ఓ చిన్న టీ బ్యాగ్‌ను వినియోగించడంపై సహచర ఆస్ట్రోనాట్స్‌  అనాటోలీపై ప్రశంసల వర్షం కురిపించారు.  

చదవండి : నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్‌ వర్క్‌ నేరుగా భూమిపైకే...!

మరిన్ని వార్తలు