gaming laptop: రూ.60వేల భారీ డిస్కౌంట్‌తో బ్రాండెడ్‌ ల్యాప్‌ ట్యాప్‌

6 Oct, 2021 13:19 IST|Sakshi

మనేదేశంలో ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌, ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్స్‌ దుమ్మురేపుతున్నాయి. ఆన్‌లైన్‌ వేదికగా జరిగే ఈ అమ్మకాల్లో తమకు నచ్చిన ప్రాడక్ట్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు వినియోగదారులు స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కుపోయారు. అయితే కొనుగోలు దారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆ రెండు ఈ కామర్స్‌ కంపెనీలు  బ్రాండెడ్‌ స్మార్ట్‌ ఫోన్లను రూ.10,000 లోపే అందిస్తున్నాయి. 

ఇప్పుడు హై కాన్ఫిగర్‌ బ్రాండెడ్‌ ల్యాప్‌ ట్యాప్‌లను తక్కువ ధరకే అమ్మేందుకు అమెజాన్‌ సిద్ధమైంది.ప్రముఖ గేమింగ్‌ ల్యాప్‌ట్యాప్‌ 'ఆసుస్‌ డాష్‌ ఎఫ్‌15' ధర రూ. 1,39,900 మార్కెట్‌లో విడుదలైంది.ఈ థమకా సేల్‌లో ల్యాప్‌ ట్యాప్‌ను రూ.60వేల డిస్కౌంట్‌తో రూ.79,990కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్‌ ప్రకటించింది.

అంతేకాదు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఈ ల్యాప్‌ ట్యాప్‌ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఐ5 11 జనరేషన్‌ వేరియంట్‌ ల్యాప్‌ ధర రూ.69,990కే సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది.    
 
ఆసుస్‌ టీయూఎఫ్‌ డాష్‌ ఎఫ్‌15 స్పెసిఫికేషన్లు    

15.6 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే 144హెచ్‌జెడ్‌ హై రిఫ్రెష్‌ రేట్‌

♦ 11 జనరేషన్‌, కోర్‌ ఐ7చిప్‌ సెట్‌

♦ 16 జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌ 512జీబీ ఎన్‌వీఎంఈ పీసీఐఆ 3.0 ఎస్‌ఎస్‌డీ

♦ బ్లూటూత్‌ వీ5.2 అండ్‌ వైఫై 6 కనెక్టివిటీ 

♦ త్రీ యూఎస్‌బీ టైప్‌ ఏ (3.2జనరేషన్‌1) పోర్ట్‌ 

♦ థండర్‌ బోల్ట్‌ 4 పోర్ట్‌, హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్‌

♦ ఆర్జే 45 అండ్‌ 3.5ఎం ఎం హెడ్‌ ఫోన్‌ జాక్‌ 

చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్‌13తో కళ్లకు ట్రీట్మెంట్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు