ల్యాప్‌టాప్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌!

6 Jan, 2022 19:06 IST|Sakshi

ప్రముఖ తైవానీస్ కంప్యూటర్ హార్డ్ వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్‌ 2022 సీఈఎస్ టెక్ షోలో ప్రపంచంలోనే మొట్టమొదటి 17 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌ని ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్‌ 2022 మధ్యలో కొనుగోలుకు అమ్మకానికి రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి 17.3 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌గా పేర్కొన్న జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌లో రెండు సైజుల ఓఎల్ఈడీ డిస్ ప్లేను కలిగి ఉంది. 1920 ఎక్స్ 1280పీ రిజల్యూషన్ గల ఈ ల్యాప్‌టాప్‌ డిస్ ప్లేను ఇంటెల్, బోటెక్నాలజీ గ్రూప్ భాగస్వామ్యంతో ఆసుస్ సహ-అభివృద్ధి చేసింది. 

ఇందులో ఉన్న ఆర్టిఫీషియల్ హెచ్డీఐఆర్ కెమెరా యూజర్ ఉనికిని గుర్తిస్తుంది. వెలుతురు బట్టి స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకునే ఇంటిగ్రేటెడ్ కలర్ సెన్సార్ ఉంది. స్పష్టమైన వీడియో కాల్స్ కోసం ఆసుస్ 3డీ నాయిస్ రిడక్షన్(3డిఎన్ఆర్) టెక్నాలజీ గల 5 మెగా పిక్సల్ వెబ్ క్యామ్ ఇందులో ఉంటుంది. ఇది 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 యు-సిరీస్ ప్రాసెసర్లు, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్స్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్‌ఎస్‌డితో వస్తుంది.  దీర్ఘకాలిక బ్యాటరీ కోసం 75 డబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అంతరిక్షంలోకి పంపిన మొదటి ఆసుస్ ల్యాప్ టాప్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుస్ ప్రత్యేక జెన్ బుక్ 14ఎక్స్ ఓఎల్ఈడీ స్పేస్ ఎడిషన్ (UX5401ZAS)ను కూడా ప్రకటించింది. 

(చదవండి: ఆన్‌లైన్‌ కిరాణా బిజినెస్‌పై రిలయన్స్‌ భారీ డీల్‌..! ఏకంగా...!)

మరిన్ని వార్తలు