ప్రీమియం ఫీచర్లతో ఆసస్‌ ల్యాప్‌టాప్స్‌: ధర ఎంతంటే?

16 Apr, 2021 10:44 IST|Sakshi

డ్యూయల్‌ డిస్‌ప్లేతోఆసస్‌ ల్యాప్‌టాప్స్‌ 

జెన్‌బుక్‌ ప్రో డ్యువో 15 ధర రూ.2,39,990

జెన్‌బుక్‌ డ్యువో 14 ధర రూ.99,990.

సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీ రంగ కంపెనీ తైవాన్‌కు చెందిన ఆసస్‌ జెన్‌బుక్‌ శ్రేణిలో డ్యువో 14, ప్రో డ్యువో 15 ఓఎల్‌ఈడీ మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. డ్యూయల్‌ డిస్‌ప్లే వీటి ప్రత్యేకత. డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీతో,  ప్రీమియం అనుభవంతో  ప్రొఫెషనల్ వినియోగదారుల  వర్క్‌ను మరింత సులభం చేస్తుందని కంపెనీ తెలిపింది.

జెన్‌బుక్‌ ప్రో డ్యువో 15 ఓఎల్‌ఈడీకి 15.6 అంగుళాల 4కే యూహెచ్‌డీ నానోఎడ్జ్‌ టచ్‌ డిస్‌ప్లే, స్టైలస్ సపోర్ట్‌తో సెకండరీ  14.1 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్‌ పొందుపరిచారు. 32జీబీ ర్యామ్‌, 1టీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ (ఎస్ఎస్‌డీ), ఇంటెల్ కోర్ ఐ 9 ప్రాసెసర్‌తో వస్తున్న దీని ధర రూ.2,39,990. (ఆరేళ్లలో కోటి స్మార్ట్‌ఫోన్లు)

జెన్‌బుక్‌ డ్యువో 14 మోడల్‌కు 14 అంగుళాల ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 12.65 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్‌ ఏర్పాటు ఉంది.     2 జీబీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 450 గ్రాఫిక్స్ కార్డ్ కూడా లభ్యం. విండోస్‌ 10 హోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఇవి పనిచేస్తాయి. ధర రూ.99,990.

 లభ్యత : జెన్‌బుక్‌ డ్యువో 14 కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ప్రో డుయో 15 వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు