మహారాష్ట్రలో భారీగా తగ్గనున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర

13 Sep, 2021 17:21 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) సబ్సిడీ పాలసీ అమలులోకి రావడంతో అథర్ 450 ప్లస్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. ఈ కొత్త విధానం వల్ల అథర్ ఎనర్జీ తన అథర్ 450+ స్కూటర్ ధరలను రూ.24,000 వరకు తగ్గించింది. ఇప్పుడు మహారాష్ట్రలో అథర్ 450 ప్లస్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.03 లక్షలుగా ఉండనుంది. దీంతో దేశంలో అన్నీ రాష్ట్రలతో పోలిస్తే అథర్ 450+ ధర మహారాష్ట్రలోనే అత్యల్పంగా ఉంది. ప్రస్తుతం దేశంలో అమ్మకానికి ఉన్న అనేక 125 సీసీ స్కూటర్ల కంటే దీని ధర చాలా తక్కువగా ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు అథర్ 450 ప్లస్ ఫేమ్ 2 ఇన్సెంటివ్ తర్వాత మహారాష్ట్రలో సుమారు ₹1.28 లక్షలకు(ఎక్స్ షోరూమ్ ధర) లభించేది.

అథర్ 450ఎక్స్ ఈవీ కేటగిరీలో వేగవంతమైన, స్మార్ట్ స్కూటర్లలో ఒకటి. ఈ స్కూటర్ 6కెడబ్ల్యు పీఎమ్ఎస్ఎమ్ మోటార్, 2.9కెడబ్ల్యు లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ అనే నాలుగు రైడింగ్ మోడ్ లతో వస్తుంది. అథర్ 450ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్ లో 116 కి.మీ దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది.(చదవండి: ఓలా 'ఫ్యూచర్‌​ ఫ్యాక్టరీ'లో అంతా మహిళా ఉద్యోగులే)

బ్యాటరీ వాటర్ రెసిస్టెంట్ ఐపీ 67 రేటెడ్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియం బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ అండ్ రియర్ కోసం రెండు డిస్క్ బ్రేకులు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్ సిడి డిస్ ప్లేతో ఈ స్కూటర్ వస్తుంది. అథర్ ఎనర్జీ అథర్ గ్రిడ్ అనే పబ్లిక్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తుంది. అథర్ ఎనర్జీ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, జైపూర్, కొచ్చి, అహ్మదాబాద్, ముంబై, మైసూరు, హుబ్లీతో సహా 22 నగరాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

మరిన్ని వార్తలు