Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరపై రూ.24 వేల వరకు తగ్గింపు

16 Sep, 2021 12:35 IST|Sakshi

వినియోగదారులకు 'ఎథేర్ ఎన‌ర్జీ' బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎథేర్ ఎన‌ర్జీ సంస్థ రూపొందించిన 450 ఎక్స్‌, 450 ఎక్స్ ప్ల‌స్‌ ఎల‌క్ట్రిక్ బైక్‌'ల ధరను భారీగా తగ్గిస్తున్నట్లు తెలిపింది. 

ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిసిక్ట్‌ సవాళ్ల నేపథ్యంలోను దేశీయ ఆటో మొబైల్‌ సంస్థలు వాహనాల్ని ధరల్ని పెంచేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎథేర్‌ ఎనర్జీ సంస్థ తన టూవీలర్‌ వాహనాల ధరల్ని తగ్గించింది. అందుకు కారణం ఎలక్ట్రికల్‌ వెహికల్‌ పాలసీయేనని చెప్పుకోవాలి. ఇటీవల మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చారు. మహరాష్ట్రాలో ఎలక్ట్రికల్‌ వాహనాలపై రూ.24,500 సబ్జీడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో మహరాష్ట్రలో ఎథేర్‌ ఎనర్జీ' ఎలక్ట్రిక్‌  బైక్‌పై రూ.25వేలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఎథేర్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్‌ ఫీచర్లు 
బెంగ‌ళూరు కేంద్రంగా ఎథేర్‌ ఎనర్జీ పలు ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ అమ్మకాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.  ఎథేర్‌ 450 ఎక్స్‌, 450 ఎక్స్ ప్ల‌స్‌ వాహనాల ఫీచర్లు.. ఇతర ఆటోమొబైల్‌ సంస్థల టూవీలర్‌ వాహనాలకు ధీటుగా నిలుస్తోంది.  ఎథేర్ 450 ఎక్స్ 5.4 కిలో వాట్ల (సుమారు 7.2 బీహెచ్పీ) ప‌వ‌ర్‌, 22 ఎన్ఎం టార్చ్ సామ‌ర్థ్యం, ఫుల్ ఎల్‌-ఈడీ లైటింగ్, రివర్స్ మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, బ్లూ టూత్ క‌నెక్టివిటీ, ట‌చ్ స్క్రీన్ సెన్సిటివ్ క‌న్సోల్, స్క్రీన్ శాటిలైట్ నావిగేష‌న్ ను జ‌త చేశారు.అధికారిక ధర ప్రకారం ఏథర్450 ఎక్స్‌ ధర రూ.1,22,741, ఎథర్ 450 ప్లస్ ధర రూ.1,03,731గా ఉంది. రహదారి పన్ను, ఇన్స్యూరెన్స్‌, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రత్యేకంగా ఉంటాయి.  

చదవండి : కొత్త చట్టం, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి..

మరిన్ని వార్తలు