Ather Energy: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్‌..!

30 Nov, 2021 18:37 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ట్రెండ్‌ నడుస్తోంది. ఓలా లాంటి కంపెనీల రాకతో ఎలక్ట్రిక్‌ వాహనాల బూమ్ మరింత ఎక్కువైంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌లో ఓలాకు గట్టిపోటీ ఇచ్చేందుకుగాను ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీదారు ఏథర్‌ ఎనర్జీ సిద్దమైంది. తమిళనాడులో హోసూర్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటుచేసుందుకు ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. 

ఏడాదిలో 4 లక్షల యూనిట్స్‌..!
దేశవ్యాప్తంగా ఏథర్‌ 450 ప్లస్‌, 450ఎక్స్‌ అనే రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఏథర్‌ ప్రవేశపెట్టింది.  ఎలక్ట్రిక్‌ వాహనాలకు క్రేజ్‌ ఎక్కువగా పెరగడంతో...ప్రస్తుతం కంపెనీ చేస్తోన్న వార్షిక ఉత్పత్తిని 120,000 యూనిట్ల నుంచి 400,000 యూనిట్లకు విస్తరించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

భారీగా పెరిగిన అమ్మకాలు..!
గత ఏడాదిలో పోలిస్తే 12 రెట్లు  అధికంగా అమ్మకాలను నమోదు చేసినట్లు ఏథర్ వెల్లడించింది. నవంబర్ 2020 నుంచి ఏథర్ అమ్మకాలు నెలవారీగా సగటున 20 శాతం మేర పెరిగాయి. 2021 ఏప్రిల్, అక్టోబర్ మధ్య వాక్-ఇన్ కస్టమర్‌లు, వెబ్ ఎంక్వైరీలు,  టెస్ట్ రైడ్‌లలో మూడు రెట్ల అధికంగా పెరిగినట్లు ఏథర్ పేర్కొంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బుకింగ్ సంఖ్యలు నాలుగు రెట్లు పెరిగాయి.
చదవండి: ట్విటర్‌ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీల కూడా భారతీయులే సీఈఓలు..!

మరిన్ని వార్తలు