ఎలక్ట్రిక్‌ వాహనాలు, 22 నగరాల్లో 500 ఛార్జింగ్‌ పాయింట్లు

28 Jul, 2021 10:42 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్‌ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ 100 నగరాల్లో ఫైనాన్షియల్‌ ఇయర్‌ -2023 నాటికి కొత్త డిజైన్లలను భారీ ఎత్తులో విడుదల చేయాలని భావిస్తోంది. క్రాష్ డిటెక్షన్ & ఎస్ఓఎస్, టో డిటెక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్,రిమోట్ డయాగ్నస్టిక్స్ అదనపు సేఫ్టీ ఫీచర్స్‌ను యాడ్‌ చేయాలని అథర్‌ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ సంస్థ  బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, జైపూర్, కొచ్చి, అహ్మదాబాద్, ముంబై, మైసూర్, హుబ్లితో సహా 22 నగరాల్లో తన సేవల్ని అందిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్ - బిన్నీ బన్సాల్, హీరో మోటోకార్ప్, టైగర్ గ్లోబల్ సపోర్ట్‌తో ఈథర్ ఎనర్జీ  దేశవ్యాప్తంగా 500 ఛార్జింగ్ పాయింట్లను ఎఫ్‌వై 22 నాటికి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.  

దేశ వ్యాప్తంగా 142 ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసి, దేశియ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఏర్పాటు చేసిన  ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది.  కాగా, 2019-2020లో  సోషల్‌, ఎన్విరాన్‌ మెంటల్‌, ఆర్ధిక అంశాల్ని నిర్ధారించే మొదటి ఇంపాక్ట్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అథర్ ఎనర్జీ తన కొత్త వాహనాన్ని డిజైన్‌ చేసినట్లు, మౌలిక సదుపాయాలే కాకుండా లోకల్‌గా సప్లయ్‌ చైన్‌ సిస్టమ్‌ అభివృద్ది చేసినట్లు, దాని ఫలితంగా ఈథర్ ఎనర్జీ వాహనాల్లో 99% లోకల్‌ ఉత్పత్తుల్ని వినియోగించి  మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా నిలిచినట్లు ఈథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా  అన్నారు. 

చదవండి :  ఇన్సూరెన్స్‌, అమ్మో..క్లెయిమ్‌ చేయని మొత్తం ఇన్నివేల కోట‍్లు ఉందా

మరిన్ని వార్తలు