బ్యాంక్‌ కస్టమర్లకు ఊహించని షాక్‌.. ఈ లావాదేవీలపై..

31 Oct, 2022 16:04 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్‌ సంస్థలు తన కస్టమర్లకు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్‌ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ప్రతి రోజు లక్షలాది బ్యాంక్‌ ఖాతాదారులు అటు ఆఫ్‌లైన్‌ ఇటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే వీటిలో పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.  ఏటీఎం సేవలు అందిస్తున్న పలు బ్యాంకులు ఇటీవల ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్‌ చార్జీల బాదుడిని మొదలెట్టాయి. ఏ బ్యాంకులు ఎంత పెంచాయో తెలుసుకుందాం!

ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఏటీఎం పై ప్రతి ప్రాంతంలో ఉచితంగా 5 లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంక్ ఏటీఎం( ATM)లలో ఈ సంఖ్య మూడుకి తగ్గించింది. అవి ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్. ఒకవేళ ఈ పరిమితి దాటి విత్‌డ్రా చేస్తే.. ఎస్‌బీఐ ఏటీఎంల్లో 5 లావాదేవీలు దాటాక ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి దాటి జరిపే వాటిపై రూ.20 వసూలు చేస్తుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
HDFC బ్యాంక్ తన ఏటీఎం (ATM) నుంచి నెలకు 5 చొప్పున ఉచిత లావాదేవీలను అందిస్తుంది. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఉచిత లావాదేవీల సంఖ్య మూడు కాగా, నాన్ మెట్రో నగరాల్లో ఐదు. ఆ తర్వాత, విత్‌డ్రా చేస్తే రూ. 21 కాగా, ఆర్థికేతర లావాదేవీలకు రూ.8.50 ఛార్జ్ చేస్తారు.

ఐసీఐసీఐ బ్యాంక్
ICICI బ్యాంక్ కూడా 5, 3 రూల్స్‌ని పాటిస్తుంది. అనగా ఆరు మెట్రో స్థానాల్లో(ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) ఐసీఐసీఐ ఏటీఎం ( ATM) నుంచి 5 విత్‌డ్రాలు,  ఇతర బ్యాంక్ ATMల నుంచి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితం. దీని తర్వాత, బ్యాంకు ఆర్థిక లావాదేవీకి రూ. 20,  ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది. 

యాక్సిస్‌ బ్యాంక్‌ 
యాక్సిస్‌ బ్యాంక్‌ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో 5 ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒకవేళ ఈ పరిమితి దాటిన ప్రతి నగదు లావాదేవీలపై రూ.21, ఆర్థికేతర లావాదీవీలపైన రూ.10 వసూలు చేస్తుంది.

పీఎన్బీ
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్‌ సిటీల పరిధిలో తమ ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు మాత్రమే ఉచితం. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, ఆర్థికేతర లావాదీవీల మీద రూ. 9 చార్జ్‌ చేస్తోంది.

చదవండి: ట్విటర్‌లో ఉద్యోగాల కోతలు షురూ

మరిన్ని వార్తలు