ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! బోనస్‌లు,ప్రమోషన్‌లు..అబ్బో ఇంకా ఎన్నెన్నో!

22 May, 2022 11:53 IST|Sakshi

ప్రపంచ దేశాలకు చెందిన ఐటీ కంపెనీల్ని అట్రిషన్‌ రేటు విపరీతంగా వేధిస్తుంది. వచ్చిపడుతున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేక..ఆఫర్లని, లేదంటే తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ఉద్యోగాల్ని ఉన్న ఫళంగా వదిలేస్తుంటే..ఆ ఉద్యోగుల్ని నిలుపుకోలేక ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్‌ దిగ్గజాలు అట్రిషన్‌ రేట్‌ తగ్గించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాయి. 

కోవిడ్‌-19 కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగానికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా అవకాశాలు విసృతంగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులు తమకు వస్తున్న అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లను అందుకుంటున్నారు. దీంతో ఐటీ సెక్టార్‌ను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రముఖ టెక్‌ దిగ్గజాలు డిజిటల్‌, డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫీయల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లో  అట్రిషన్‌ రేట్‌ తగ్గిస్తూ, స్కిల్స్‌ ఉన్న ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయి.

ఇందులో భాగంగా విప్రో, కాగ్నిజెంట్‌, మైండ్‌ ట్రీ, టెక్‌ మహీంద్రా, ఎంఫసిస్‌లాంటి సంస్థలు ఉద్యోగులకు స్పెషల్‌ బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ స్టాక్స్‌(ఈఎస్‌ఓపీఎస్‌) భాగస్వామ్యం ఇవ్వడం, ఉన్న జాబ్‌లో స్మార్ట్‌గా చేసేందుకు సిల్స్‌, లేదంటే మరో విభాగానికి చెందిన ప్రాజెక్ట్‌ చేసేలా ప్రత్యేకంగా క్లాసుల్ని నిర్వహించడం, ఉన్న సంస్థలో చేస్తున్న జాబ్‌ నచ్చక ఇబ్బంది పడుతుంటే..అదే సంస్థలో వారికి నచ్చిన విభాగంలో పనిచేసేలా ప్రోత్సహించడం, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చదువుకునేలా అనుమతి ఇవ్వడం, వర్క్‌ ఫ్రమ్‌ లేదంటే ఎక్కడి నుండైనా పనిచేసేలా ఉద్యోగులకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. 

తద్వారా అట్రిషన్‌ రేట్‌ను పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు సైతం ఈ ఆఫర్లకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. 

చదవండి👉ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు!

మరిన్ని వార్తలు