ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ భారీ నిధుల సమీకరణ

19 Aug, 2021 02:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ సంస్థ ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ భారీ స్థాయిలో నిధుల సమీకరణకు రెడీ అవుతోంది. ఇందుకు తాజా ఏజీఎంలో వాటాదారుల అనుమతి పొందినట్లు వెల్లడించింది. వెరసి రుణాలు, ఈక్విటీ ద్వారా రూ. 14,500 కోట్లను సమీకరించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. నిధులను బిజినెస్‌ వృద్ధి అవకాశాలపై వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. దేశీ, విదేశీ రుణాల ద్వారా రూ.12,000 కోట్లు, ఈక్విటీ పెట్టుబడుల ద్వారా మరో రూ.2,500 కోట్లు  సమకూర్చు కునే ప్రణాళికలు వేసినట్లు వివరించింది.

మరిన్ని వార్తలు