బాలీవుడ్‌ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్‌

21 Aug, 2023 11:51 IST|Sakshi

బ్యాంకు ఆఫ్‌బరోడాలో బీజేపీ ఎంపీ, సన్నీ డియోల్‌ రుణం

రూ. 56 కోట్లకు బకాయివేలం నోటీసు ఇచ్చిన బ్యాంకు

అనూహ్యంగా ఉపసంహరణప్రకటన, కాంగ్రెస్‌ విమర్శలు

బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం  కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా  సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్‌కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా  వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్‌..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!)

తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై  కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్‌ (ట్విటర్‌)లో  విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్‌డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్‌ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్‌ మంత్‌ నుంచే ఆదాయం పొందొచ్చా?   )

బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ
జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్),  బకాయలను చెల్లించేందుకు  తమను  సంప్రదించినట్లు బరోడాకు చెందిన  బీవోబీ బ్యాంకు  తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. 
 

కాగా మధ్యప్రదేశ్‌లో గురుదాస్‌ ఎంపీ  సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం  రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని  సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు,  ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు  దరఖాస్తు  చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్‌ ప్రైస్‌గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్‌ రోడ్‌లో సన్నీ విల్లా, సినీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టూడియో ‘సన్నీ సూపర్‌ సౌండ్‌’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి  బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్‌కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్  తండ్రి, బాలీవుడ్‌ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం​. 


 

మరిన్ని వార్తలు