Audi e-Tron: అదిరే 'ఆడి'.. ఇండియన్‌ మార్కెట్‌లో మరో సూపర్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

22 Sep, 2021 14:05 IST|Sakshi

లగ్జరీ బ్రాండ్‌ ఆడి సరికొత్త  ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్‌ కారుని మార్కెట్‌లోకి రీలీజ్‌ చేసింది. టెస్లాకార్లకు పోటీగా ఈ కారు ఎస్‌యూవీ మోడల్‌ ఎక్స్‌షోరూం ధర రూ. 1,79,90,000లుగా స్పోర్ట్స్‌ మోడల్‌ ధర రూ. 2.05 కోట్లుగా ఆడి నిర్ణయించింది. 

ఆడి సంస్థ తమ ఈవీ కారుని ఎస్‌యూవీ, స్పోర్ట్స్‌ బ్యాక్‌ మోడళ్లలో మార్కెట్లోకి తెస్తోంది. ఈ రెండు మోడళ్లలో స్టాండర్డ్‌, ఆర్‌ఎస్‌ వేరియంట్లు ఉన్నాయి

ఈ ట్రాన్‌ కార్లలో 93 కిలోవాట్‌ లిథియమ్‌ ఐయాన్‌ బ్యాటరీని అమర్చారు. స్టాండర్డ్‌ వేరియంట్‌లో ఒక్క సారి ఛార్జ్‌ చేస్తేఏ 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఆర్‌ఎస్‌ వేరియంట్‌ 481 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది

ఆర్‌ఎస్‌ ఈట్రాన్‌ కారు 637 బీహెచ్‌పీతో 830ఎన్‌ఎం టార్క్‌ని రిలీజ్‌ చేస్తుంది. స్టాండర్డ్‌ ఈ ట్రాన్‌ 523 బీహెచ్‌పీతో 630 ఎన్‌ఎం టార్క్‌ని రిలీజ్‌ చేస్తుంది.

3.3 సెకండ్ల నుంచి 4.1 సెకన్ల వ్యవధిలో గంటలకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు

2025 కల్లా ఇండియా ఈవీ మార్కెట్‌లో 25 శాతం మార్కెట్‌ వాటాని ఆడి లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు