మార్కెట్‌లోకి నయా ఆడి ఎలక్ట్రిక్‌ కారు వేరియంట్లు..! ధర ఎంతంటే

13 Jul, 2021 22:25 IST|Sakshi

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు ఆడి భారత విపణిలోకి ఈ-ట్రోన్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ వేరియంట్లను లాంచ్‌ చేసింది. ఈ-ట్రోన్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఎస్‌యూవీ, స్పోర్ట్‌బ్యాక్‌ అనే రెండు రకాల బాడీ స్టైల్స్‌తో ఆడి కస్టమర్లకు అందించనుంది. తొలిసారిగా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మల్టీపుల్‌ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చిన  లగ్జరీ కార్ల సంస్థగా ఆడి నిలిచింది.


ఆడి ఈ-ట్రోన్‌ ఎలక్ట్రిక్‌ కార్లలో ఈ-ట్రోన్‌50, ఈ-ట్రోన్‌55, ఈ-ట్రోన్‌55 స్పోర్ట్స్ బ్యాక్‌ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి.  ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.


ఆడి ఈ-ట్రోన్‌50 ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 99 లక్షలు, ఈ-ట్రోన్‌55 ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 1.1కోట్లు, ఈ-ట్రోన్‌55 స్పోర్ట్‌బ్యాక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 1.2 కోట్లుగా నిర్ణయించారు. ఈ కార్లు 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్‌ కారుని న్యూ ఏజ్‌ లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి పేర్కొంటోంది.


ఇందులో మల్టీ ఫంక్షనల్‌ స్టీరింగ్‌ వీల్‌, ఫోర్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఆంబియెంట్‌ లైటింగ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్‌ బెంజ్‌ EQC, జాగ్వర్‌ ఐ పేస్‌ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. 

మరిన్ని వార్తలు