అదిరిపోయిన ఆడి క్యూ5.. బీఎండబ్ల్యూ ఎక్స్3కి పోటీగా!

23 Nov, 2021 18:24 IST|Sakshi

ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్లరీ కార్ల తయారీ సంస్ల ఆడి ఈరోజు భారతదేశంలో ఆడి క్యూ5ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల క్రితం బిఎస్ 6 నిబంధనల కారణంగా భారతీయ మార్కెట్ల నుంచి వైదొలగిన క్యూ5 ఫేస్ లిఫ్ట్ ఎస్‌యువి కారు కొత్త అవతారంలో తిరిగి వచ్చింది. కంపెనీ 2021 ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ఎస్‌యువిని రూ. 58.93 లక్షల(ఎక్స్ షోరూమ్)కు, ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 63.77 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఇప్పటికే వినియోగదారులు వందకు పైగా యూనిట్లు బుక్ చేసినట్లు, డెలివరీలు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆడి ధృవీకరించింది. 

ఆడి క్యూ5 ఎస్‌యువి కారు బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ జిఎల్ సి, వోల్వో ఎక్స్ సీ60 వంటి కార్లకు పోటీనిస్తుంది. భారతదేశంలో ఐసీఈ కార్ల అమ్మకాలను పెంచడానికి కొత్త క్యూ5 దోహదపడుతుందని ఆడి భావిస్తోంది. దీనిలో 2.0 లీటర్‌ టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ 249 బిహెచ్‌పీ శక్తిని, 370 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇది క్వాటో ఆల్‌-వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీ, డంపర్‌ కంట్రోల్‌తో సస్పెన్షన్‌ సిస్టమ్‌ మెరుగైన డ్రైవ్‌ డైనమిక్‌లతో వస్తుంది. నిలువు స్టట్‌లతో కూడిన సింగిల్‌ఫ్రేమ్‌ గ్రిల్‌, రీడిజైన్‌ చేయబడిన బంపర్‌లు, ఎల్ఈడీ లైట్లు, ఆడి క్యూ-5కి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి.

(చదవండి: ‘సర్‌.. నాకు ఐదు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయి! మంచిదేనా?’)

ఆడి పార్క్‌ అసిస్ట్‌, సెన్సార్‌ కంట్రోల్డ్‌ బూట్‌ లిడ్‌ ఆపరేషన్‌తో కూడిన కంఫర్ట్‌ క్హీ ఆడి ఎక్స్‌క్లూజివ్‌ పియానో బ్లాక్‌, ఆడి వర్చువల్‌ కాక్‌పిట్‌ ఫ్లస్‌, 19 స్పీకర్‌ B&0 ప్రీమియం 3డీ సౌండ్‌ సిస్టమ్‌తో సహా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడి స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా ఇన్ఫోటైన్‌మెంట్‌ & కనెక్టివిటీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో కూడిన ఆడి ఫోన్‌ బాక్స్‌, MMI టచ్‌తో MMI నావిగేషన్‌ ఫ్లస్‌ సిస్టమ్ ఇందులో ఉంది. అడి డ్రైవ్‌ సెలెక్ట్‌ సౌకర్యం, డైనమిక్‌, వ్యక్తిగత, ఆటో, సామర్థ్యం, ఆఫ్‌-రోడ్‌తో సహా బహుళ మోడ్‌లను అందిస్తుంది. భద్రత కోసం వెనుక వైపు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా మొత్తం 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ ఎస్‌యువి కారు గంటకు 237 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.ఎఆర్ఎఐ సర్టిఫై చేసిన ప్రకారం లీటరుకు 17.01 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

(చదవండి: ప్ర‌పంచంలో అత్య‌ధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!)

మరిన్ని వార్తలు