ఇక ఆడి పెట్రోల్‌, డీజిల్‌ కార్లు ఉండవా?

19 Jun, 2021 18:57 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బ్రాండ్‌గా మారనున్న ఆడి

2026 వరకే పెట్రోల్‌, డీజిల్‌ మోడల్‌ కార్ల రిలీజ్‌

మరో పదేళ్ల వరకే సర్వీసుల అందచేత

ఆ తర్వాత పెట్రోల్‌, డిజిల్‌ సెగ్మెంట్‌ గుడ్‌బై 

వెబ్‌డెస్క్‌: లగ్జరీ కార్లలో ఆడిది ప్రత్యేక స్థానం. రాబోయే ట్రెండ్‌కి తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఆడి. అందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్‌ కార్లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో మాత్రమే కొత్త మోడళ్లు తేవాలన్నది ఆ సంస్థ వ్యూహంగా ఉంది.  ఈ మేరకు జర్మన్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

2026 వరకే
ఎన్నో ఏళ్లుగా ఈ సం‍స్థ ప్రతీ ఏడు ఓ కొత్త మోడల్‌ని మార్కెట్‌లోకి ఆడి రిలీజ్‌ చేస్తోంది. ఆడిని ప్రమోట్‌ చేస్తోన్న వోక్స్‌వ్యాగన్‌ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఆడిని పూర్తిగా ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌కే పరిమితం చేసే విధంగా కార్యాచరణ అమలు చేస్తోంది.  అందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌ సెగ్మెంట్‌కు సంబంధించి చివరి మోడల్‌ని 2026లో  రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత మరో పదేళ్ల పాటు డిజీల్‌, పెట్రోల్‌ ఇంజన్‌ వెహికల్స్‌కి సర్వీస్‌ అందివ్వనుంది. అనంతరం పూర్తిగా పెట్రోల్‌, డీజిల్‌ సెగ్మెంట్‌ నుంచి తప్పుకోవడం ఖాయమని తేల్చి చెబుతోంది ఆడి యాజమాన్యం. ఇప్పటికే కంబస్టర్‌ ఇంజన్‌ తయారీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ఖర్చును గణనీయంగా తగ్గించింది. 

ఓన్లీ ఈవీ
వోక్స్‌వ్యాగన్‌ నుంచి ఎంట్రీ, మిడ్‌ రేంజ్‌ కార్లు  వివిధ పేర్లతో మార్కెట్‌కి వస్తుండగా.... లగ్జరీ విభాగంలో ఆడీ, హై ఎండ్‌ విభాగంలో పోర్షే, స్పోర్ట్స్‌ సెక‌్షన్‌లో లాంబోర్గిని కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ఆడిని పూర్తి స్థాయి ఈవీ కార్ల తయారీకే వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆడి నుంచి ఈ ట్రోన్‌, ఈ ట్రోన్‌ స్పోర్ట్‌‍ బ్యాక్‌,  క్యూ 4 ఈ ట్రోన్‌, ఈ ట్రోన్‌ జీటీ కార్లను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో తెచ్చింది. ఇందులో ఈ ట్రోన్‌ పేరుతో కొత్త ఈవీ లగ్జరీ కారుని ఇండియా మార్కెట్‌లోకి రిలీజ్‌ అయ్యింది. 
చదవండి : స్టైలిష్‌ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా'

మరిన్ని వార్తలు