సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా హీరోలేనా, మనము ఎగిరి పోదాం

20 Jun, 2021 09:46 IST|Sakshi

బ్యాక్‌ ప్యాక్ హెలికాప్టర్‌‌‌‌  డిజైన్‌  

టర్బన్ల సాయంతో ప్రయాణం 

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు, విలన్లు వీపుకి చిన్న సిలిండర్‌‌‌‌ తగిలించుకుని గాల్లోకి దూసుకెళ్తుంటారు. ఆ సీన్లని చూసినప్పుడల్లా ఇలాంటి టెక్నాలజీ డెవలప్‌ అయితే బాగుండు. మనం ఎంచక్కా గాల్లో ఎగిరిపోవచ్చు అని అనుకుంటాం. బహుశా రాబోయే రోజుల్లో ఇది సాధ్యం కావొచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన కాప్టర్‌‌‌‌ప్యాక్ అనే సంస్థ సోలో ‘బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్‌‌‌‌’ను డెవలప్ చేసింది. ప్రస్తుతం కాప్ట్‌‌ప్యాక్‌‌ టెస్ట్‌‌ రన్‌ వీడియోల్ని ఆ సంస్థ యూట్యూబ్‌‌లో షేర్‌‌‌‌ చేసింది. ఇందులో ఓ యువకుడు కాప్టర్‌‌‌‌ప్యాక్‌‌ను తగిలించుకుని, మెషీన్ ఆన్‌‌ చేసి 50 అడుగుల ఎత్తులో కొన్ని సెకన్ల పాటు ఎగిరాడు.

ఎలా పనిచేస్తుంది

హెలికాప్టర్‌ మోటార్‌, రూటర్‌లు ఎలా ఉంటాయో ఈ బ్యాక్‌ ప్యాక్‌ హెలికాప్టర్‌ కు రెండు జైంట్‌ టర్బన్లు ఉంటాయి. టర్బన్లను వీపుకు తగిలించుకొని గాల్లో ఎగరవచ్చు. ఇందుకు సపోర్ట్‌ గా ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాటరీలు ఉన్నాయి. ఛార్జింగ్‌ పెట్టి అవసరం అనుకున్నప్పుడు ఉపయోగించవచ్చు. అయితే ప్రస్తుతం ట్రయల్‌ రన్స్‌లో ఉన్న ఈ హెలికాప్టర్‌కు కొన్ని మార్పులు చేయాల్సి ఉందని దీన్ని డిజైన్‌ చేసిన మ్యాట్‌ తెలిపారు. 

గతంలో ఫ్లాప్‌, మరి ఇప్పుడో 

కాగా, గతంలో దుబాయ్, చైనా, న్యూజిలాండ్‌‌కు చెందిన కంపెనీలు బ్యాక్‌ ప్యాక్‌ హెలికాప్టర్లను తయారు చేశాయి. కానీ అవి అట్టర్‌ ప‍్లాప్‌గా మిగిలిపోయాయి. గతేడాది ఓ దుబాయ్‌ సంస్థ జెట్‌ బ్యాక్‌ ప్యాక్‌ హెలికాప్టర్‌ను తయారు చేసింది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే జెట్ బ్యాక్‌‌ప్యాక్‌‌ను రూపొందించింది. జెట్‌‌ ఫ్యూయల్‌ ఇంజన్లతో 20 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లవచ్చు. కానీ ఫ్యూయల్‌ సమస్యలు తలెత్తడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఓ యువకుడు హెలికాప్టర్‌ను తగిలించుకొని ఎగిరే ప్రయత్నం చేశాడు. గాల్లో ఉండగా ఆ హెలికాప్టర్‌ అటాచ్‌ చేసిన ప్యారాచూట్‌ తెరుచుకోకపోవడం మరణించాడు. తాజాగా ఆస‍్ట్రేలియా కంపెనీ తయారు చేసిన బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్‌‌‌‌ సక్సెస్‌ అవుతుందా? లేదంటే ఫెయిల్‌ అవుతుందా' అనేది టెక్నాలజీపై ఆదారపడి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు