Mark Zuckerberg: ఫ్రాన్సెన్స్‌ హాగెన్‌ చిచ్చు..ఫేస్‌బుక్‌పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?!

25 Oct, 2021 12:06 IST|Sakshi

యూజర్ల భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందంటూ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్‌ హాగెన్‌ పెట్టిన చిచ్చు ఫేస్‌ బుక్‌ను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ఆరోపణలే ఫేస్‌బుక్‌ పేరు సైతం మార్చే దిశగా జుకర్‌ బెర్గ్‌ ప్రయత్నాలు ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ తో పాటు ఇతర సోషల్‌ మీడియా సంస్థలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 10 మిలియన్ల జరిమానా విధించే  యోచనలో ఉందని తెలుస్తోంది. 

తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్‌ మీడియాపై కొత్త చట్టాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సోషల్‌ మీడియా సంస్థలకు 10 మిలియన్ల వరకు జరిమాన విధించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. అదే జరిగితే ముందుగా ఫేస్‌బుక్‌ జరిమానా కట్టాల్సి ఉంటుందనే  అనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల సోషల్‌ మీడియా చట్టాల్ని మరింత కఠిన తరం చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ మైఖేలియా క్యాష్ మాట్లాడుతూ.. సోషల్‌ ఫోరమ్‌ సైట్‌ రెడ‍్డిట్‌తో పాటు బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న సోషల్‌ మీడియా కంపెనీలు యూజర్ల వయస్సును నిర్ధారించడానికి డేటాను సేకరిస్తున్నాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం. ముసాయిదా చట్టం ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి, చట్టాల్ని ఉల్లంఘించిన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాంలు 10 మిలియన్ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు.  

మానసిక ఆరోగ్యం,ఆత్మహత్యల నివారణపై ఆస్ట్రేలియా సహాయ మంత్రి డేవిడ్ కోల్‌మాన్ మాట్లాడుతూ..ఫేస్‌బుక్ యువతీ యువకుల మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ''ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం ప్రతినిధులు సోషల్‌ మీడియా సంస్థల చట్టాల ఉల్లంఘనపై విచారణ, జరిమానా విధించే అధికారం ఉందని తెలిపారు. విచారణలో ఉల్లంఘన నిజమైతే 10మిలియన్లు లేదా సంస్థల వార్షిక టర్నోవర్‌లో 10శాతం, ఆర్ధిక ప్రయోజనం కోసం ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు.

చదవండి: ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం.. పేరు మార్పు!

మరిన్ని వార్తలు