వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..!

17 Feb, 2022 17:32 IST|Sakshi

మన దేశంలో క్రిప్టోకరెన్సీకి అత్యంత ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తోన్న వారిలో భారత్‌ సుమారు 10 కోట్ల మందితో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు క్రిప్టోకరెన్సీతో పాటుగా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ)కు ‍కూడా భారత్‌లో భారీ ఆదరణ లభిస్తోంది. 

మన దేశంలో ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, స్మృతి మంధాన, సునీల్ గవాస్కర్, భువనేశ్వర్ కుమార్ వంటి క్రికెటర్స్ ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఎన్‌ఎఫ్‌టీ తెచ్చేందుకు తాను కూడా సిద్దం అంటున్నారు. ఆరోన్ ఫించ్ తన ఎన్‌ఎఫ్‌టీలను విడుదల చేయడానికి అధికారికంగా లైసెన్స్ పొందిన మొదటి క్రికెట్ డిజిటల్ కలెక్టిబుల్స్ ప్లాట్ ఫామ్ రారియోతో జతకట్టాడు. ఈ ఎన్‌ఎఫ్‌టీలు రారియోలో అందుబాటులో ఉండనున్నాయి. ప్రపంచంలోనే అధికారికంగా లైసెన్స్‌​ పొందిన తొలి క్రికెట్‌ ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫామ్‌ రారియోలో చాలా మంది ఇతర క్రికెటర్లకు చెందిన అనేక ఎన్‌ఎఫ్‌టీలు అందుబాటులో ఉన్నాయి.

2018లో జింబాబ్వేపై 172 పరుగులు చేసిన అత్యధిక స్కోరుతో 2013లో ఇంగ్లాండ్ పై సాధించిన తన 156 పరుగుల రికార్డును అధిగమించాడు. 2013లో ఒక ఇన్నింగ్స్లో ఫించ్ బాధిన 14 సిక్సర్లు ఉన్నాయి. అతను ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్, సర్రేలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియన్ వైట్-బాల్ కెప్టెన్ బీబీఎల్ ప్రారంభం నుంచి మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. వీటికి సంబంధించిన వీడియోల రూపంలో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. "రారియో క్రికెట్ ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫామ్‌తో నా ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది, ఇక్కడ మీరు నా ఎన్‌ఎఫ్‌టీలను స్వంతం చేసుకోవచ్చు" అని అన్నారు. 

(చదవండి: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన ధరలు!)

మరిన్ని వార్తలు