Reliance : అమ్మకానికి అనిల్‌ అంబానీ ఆస్తులు

21 Jun, 2021 11:00 IST|Sakshi

నష్టాల్లో కూరుకుపోయిన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 

గరిష్ట బిడ్డర్‌గా  నిలిచిన ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 

కొంత మేర తీరనున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కష్టాలు 

న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కొనుగోలుకి ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. రూ. 2,900 కోట్ల ఆఫర్‌తో బిడ్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆథమ్‌ నుంచి ముందస్తు చెలింపుగా 90 శాతం నిధులు లభిచనుండగా.. మరో రూ. 300 కోట్లు ఏడాదిలోగా బీవోబీ పొందనున్నట్లు వివరించాయి. బిడ్డింగ్‌కు వారాంతాన గడువు ముగిసింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌కు రుణాలిచ్చిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) రూ. 2,587 కోట్లు అందుకునే వీలున్నట్లు పేర్కొన్నాయి.  

రేసులో ఆథమ్‌
దేశీ ఎన్‌బీఎఫ్‌సీ ఆథమ్‌ రేసులో తొలి ర్యాంకులో నిలిచినట్లు తెలుస్తోంది.  15 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆథమ్‌ నెట్‌వర్త్‌ రూ. 1,500 కోట్లుగా నమోదైంది. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా ఆథమ్‌ వేసిన బిడ్‌ అత్యధిక నికర ప్రస్తుత విలువ(ఎన్‌పీవీ)ను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అత్యధిక శాతం రుణదాతలు ఆథమ్‌కు ఓటు వేసినట్లు వెల్లడించాయి.  

ఇతర సంస్థలూ
రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కొనుగోలుకి ఆథమ్‌ కాకుండా..  ఏఆర్‌ఈఎస్‌ ఎస్‌ఎస్‌జీ, అసెట్స్‌కేర్‌– రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్, ఏఆర్‌సీఎల్‌తో కలసి ఎవెన్యూ క్యాపిటల్, క్యాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌  బిడ్‌ వేసినట్లు తెలుస్తోంది.

చదవండి: Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..!

మరిన్ని వార్తలు