ముగిసిన ఆటో ఎక్స్‌పో

19 Jan, 2023 00:59 IST|Sakshi

రికార్డు స్థాయిలో 6.3 లక్షల మంది సందర్శన

గ్రేటర్‌ నోయిడా: సుమారు వారం రోజులు సాగిన ఆటో ఎక్స్‌పో బుధవారంతో ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో 6,36,743 మంది షోను సందర్శించినట్లు దేశీ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ తెలిపింది. రెండేళ్లకోసారి జరిగే ఆటో షోను వాస్తవానికి 2022లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌–19 కారణంగా 2023కి వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 11న ప్రారంభమై 18తో ముగిసింది.

తొలి రెండు రోజులు (11,12) మీడియా కోసం కేటాయించగా, 13–18 వరకు సందర్శకులను అనుమతించారు. ఆటో కంపెనీలు ఇందులో 75 పైచిలుకు వాహనాలను ఆవిష్కరించాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా వంటివి పాల్గొనగా మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్కోడా వంటి కంపెనీలు దూరంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ అయిదు డోర్ల జిమ్నీ వెర్షన్‌ను, హ్యుందాయ్‌ మోటర్స్‌ ఇండియా అయానిక్‌ 5ని, కియా ఇండియా తమ కాన్సెప్ట్‌ ఈవీ9 మొదలైన వాహనాలను ఆవిష్కరించాయి.   
గ్రేటర్‌ నోయిడాలో ఆటో ఎక్స్‌పో 2023 సందర్భంగా  బుధవారం టయోటా పెవీలియన్‌లో సందర్శకులు 

>
మరిన్ని వార్తలు