Auto Expo 2023: హ్యుందాయ్‌ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్‌; షారూఖ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

11 Jan, 2023 17:33 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభం​మైన ఆటో ఎక్స్‌పో 2023 (జనవరి 11నుంచి 18 వరకు) వాహన ప్రియులను, బిజినెస్‌ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 45 దేశీయ, అంతర్జాతీయ తయారీ సంస్థలు కొత్త మోడళ్లు, విద్యుత్తు కార్లు, కాన్సెప్ట్‌ కార్లు, త్రి, ద్విచక్ర వాహనాలు,  కమర్షియల్‌ వెహికల్స్‌ ఎగ్జిబిట్‌ కానున్నాయి.   ఈ క్రమంలో  ఆటో ఎక్స్‌పో మొదటి రోజున, ప్రముఖ వాహన తయారీదారు హ్యుందాయ్ మోటార్స్ ఐయోనిక్ 5  ఎలక్ట్రిక్‌  స్‌యూవీని లాంచ్‌ చేసింది. దీంతోపాటు  స్లీక్‌  అండ్‌  ఫుల్లీ-ఎలక్ట్రిక్ సెడాన్ Ioniq 6నికూడా ప్రదర్శించింది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ ఈ కారును ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  హ్యుందాయ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌  షారూఖ్‌ తనదైన 'సిగ్నేచర్ స్టైల్'లో Ioniq 5తో పోజులివ్వడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. లక్ష రూపాయలతో బుకింగ్‌లకు సిద్ధంగా  ఉన్న  ఈ కారు ధరను  ఆటో ఎక్స్‌పో 2023లో  కంపెనీ తాజాగా  వెల్లడించింది.   ప్రారంభ ధర రూ. 44.95 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది.

 


తెలుపు, నలుపు , ప్రత్యేకమైన మ్యాట్ సిల్వర్ కలర్స్‌లో ఇది లభ్యం. ఐనాక్‌ 5 ఎలక్ట్రిక్  ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ & ప్యాసింజర్, సైడ్ & కర్టెన్), వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ (VESS), ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), మొత్తం నాలుగు డిస్క్ బ్రేక్‌లు, మల్టీ కొలిజన్-ఎవాయిడెన్స్ బ్రేక్ (MCB) పవర్   ఫీచర్లున్నాయి. ముఖ్యంగా కేవలం 18 నిమిషాల్లో (350kw DC ఛార్జర్‌) 10- 80శాతం వరకు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో వస్తుందని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు