Auto Expo 2023 కియా కేఏ4 ఆవిష్కారం, 2 వేల కోట్ల  భారీ పెట్టుబడి

11 Jan, 2023 16:14 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల తయారీదారులలో ఒకటైన కియా ఇండియా ఆటో ఎక్స్‌పో 2023లో  తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కాన్సెప్ట్ EV9 SUV , KA4 కార్లను ఆవిష్కరించింది.అంతేకాదు ఇండియాలో రానున్న 4-5 సంవత్సరాలలో  రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌, 2025లో  మేడిన్‌ ఇండియా ఈవీనీ లాంచింగ్‌లో ఈ పెట్టుబడి సహాయపడుతుందని  కియా పేర్కొంది.

కియా ఇండియా తన ఆల్-ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ - కియా కాన్సెప్ట్  ఈవీ9,   కొత్త కేఏ4లను జనవరి 11న ప్రారంభమైన ఆటో ఎక్స్‌పో 16వ ఎడిషన్‌లో లాంచ్‌ చేసింది. KA4 లాంచ్‌తో, కంపెనీ MPV సెగ్మెంట్‌లో బలమైన పట్టు సాధించాలని చూస్తోంది.  ఈ 4వ జనరేషన్‌ కార్నివాల్‌ ఎంపీవీ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది.  

 అంతర్జాతీయ మార్కెట్లో  కేఏ4 3 ఇంజన్ ఎంపికలతో  రానుంది.  వీటిలో 3.5-లీటర్ GDi V6 పెట్రోల్, 3.5-లీటర్ MPi V6 పెట్రోల్ , 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభ్యంకానుంది. 3 లేదా 4 వరుసల సీటింగ్ కాన్ఫిగ రేషన్‌లతో, గరిష్టంగా 11 మంది ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుందట.

12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే డ్యాష్‌ బోర్డ్‌లోని టచ్-సెన్సిటివ్ బటన్స్‌ ద్వారా ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్‌లను నియంత్రించే  ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. 

కాగా మూడు సంవత్సరాల కోవిడ్ అనంతరం జరుగుతున్న మొదటి ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది.  వివిధ విభాగాల నుండి 45 వాహన తయారీదారులతో సహా 70 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు.కియా ఇండియా 2023లో 220 నగరాలకు విస్తరించాలని , 2024 నాటికి 100 ప్లస్ అవుట్‌లెట్‌లకు చేరుకోవాలని యోచిస్తోంది.


 

మరిన్ని వార్తలు