Auto Expo2023:స్టైలిష్ డిజైన్‌తో టార్క్‌  కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

11 Jan, 2023 21:08 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు టార్క్‌ మోటార్స్‌ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ -  క్రాటోస్  ఎక్స్‌ని  ఆవిష్కరించింది.అలాగే సరికొత్త అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ ఈ-మోటార్‌సైకిల్ క్రా టోస్‌ ఆర్‌(kratos R) పేరిట  తీసుకొచ్చింది.  వేగవంతమైన, మెరుగైన, టోర్కియర్: ది స్పోర్టియర్ క్రాటోస్ ® X అని  టార్క్‌ కంపెనీ ప్రకటించింది. 2023  రెండో త్రైమాసికంలోఈ మోటార్‌ సైకిల్‌ బుకింగ్‌లు ప్రారంభం.

మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగాన్ని మరింత అందుబాటులోకి ,ఆచరణాత్మకంగా చేయడానికి కట్టుబడి  ఉన్నామని  TORK మోటార్స్ వ్యవస్థాపకుడు,సీఈఓ కపిల్ షెల్కే  తెలిపారు. ఈ రోజు కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయి అని సంతోషం ప్రకటించారు.  బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ టెక్నాలజీతో  స్పోర్టియర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అద్భుతమైన సౌకర్యం, మెరుగైన పనితీరు , మెరుగైన రైడింగ్ అనుభవం కోసం రూపొందించినట్టు తెలిపారు.

తమ డైనమిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌  అత్యుత్తమ పవర్‌ట్రెయిన్,  టార్క్‌ను అందిస్తుందనీ, డిస్ప్లే ఇన్‌స్ట్రుమెంటేషన్‌,  ఇతర సేఫ్టీ ఫీచర్లు హోస్ట్ రైడింగ్ అనుభవాన్ని మరింత సురక్షితం చేస్తుందని వెల్లడించారు. అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కాగా కంపెనీ ఇటీవల పూణేలో తన మొట్టమొదటి  ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని (COCO మోడల్) ప్రారంభించింది. హైదరాబాద్, సూరత్, పాట్నా నగరాల్లో డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం, పూణే, ముంబై, హైదరాబాద్‌లో డెలివరీ చేస్తోంది.

త్వరలో ఇతర మార్కెట్‌లలో కూడా   ప్రారంభించ నుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ బైక్స్‌ను బుక్‌ చేసుకోవచ్చని టార్క్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  క్రాటోస్‌ ఆర్‌లో  రిఫైన్డ్ లైవ్ డాష్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, మెరుగైన ముందు, వెనుక బ్లింకర్లు లాంటి మార్పులు చేసింది.  అలాగే  ఈ మోటార్‌ సైకిల్‌  జెట్ బ్లాక్,  వైట్.రెండు కొత్త వేరియంట్‌లలో లభిస్తుంది 

మరిన్ని వార్తలు