మళ్లీ 38,000కు- ఆటో, మెటల్‌ దన్ను‌

17 Aug, 2020 15:58 IST|Sakshi

ఆటుపోట్ల మధ్య లాభాలతో ముగిసిన మార్కెట్‌

173 పాయింట్లు ప్లస్‌-38,051కు సెన్సెక్స్‌

69 పాయింట్లు పెరిగి 11,247 వద్ద నిలిచిన నిఫ్టీ

పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా రంగాల వెనకడుగు

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం అప్

రోజంతా అటూఇటుగా కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి పటిష్టంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 173 పాయింట్లు పుంజుకుని 38,051 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 38,000 పాయింట్ల మార్క్‌ ఎగువన స్థిరపడింది. నిఫ్టీ 69 పాయింట్లు ఎగసి 11,247 వద్ద ముగిసింది. అయితే మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ రోజంతా ఒడిదొడుకుల మధ్య కదిలాయి. వెరసి సెన్సెక్స్‌ 38,119 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,734 వద్ద కనిష్టానికీ చేరింది. నిఫ్టీ సైతం 11,267- 11,145 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రస్తుతం మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఐటీ అండ
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, మెటల్‌, ఆటో రంగాలు 2.5 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్ సైతం 1.4-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా 0.4 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, ఐషర్‌, జీ, హిందాల్కో, బజాజ్‌ ఆటో, హీరో మోటో, టెక్‌ మహీంద్రా, ఐవోసీ, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, మారుతీ, విప్రో 7.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్‌, బీపీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా 1.6-0.5 శాతం మధ్య నీరసించాయి.

ఆటో స్పీడ్
డెరివేటివ్‌ కౌంటర్లలో సన్‌ టీవీ, మదర్‌సన్‌, ఎస్కార్ట్స్‌, జిందాల్‌ స్టీల్‌, ఆర్‌బీఎల్‌, డీఎల్‌ఎఫ్‌, మైండ్‌ట్రీ, టొరంట్‌ పవర్‌ 6-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరొపక్క చోళమండలం ఫైనాన్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, పెట్రోనెట్‌, ఎంఆర్‌ఎఫ్‌, బీఈఎల్‌, అరబిందో ఫార్మా, బెర్జర్‌ పెయింట్స్‌, లుపిన్‌ 2.4-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,645 లాభపడగా.. 1,129 నష్టపోయాయి.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 46 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 797 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 416 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 764 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు