అమ్మకాల జోరు, ఏ వాహనాల్ని ఎక్కువగా కొన్నారంటే..

10 Aug, 2021 07:46 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలైలో వాహన అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం విక్రయాలు అధికమై 15,56,777 యూనిట్లు నమోదయ్యాయి. 

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం.. ప్రయాణికుల వాహనాలు 63 శాతం పెరిగి 2,61,744 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 28 శాతం అధికమై 11,32,611, వాణిజ్య వాహనాలు రెండున్నరెట్లు ఎగసి 52,130 యూనిట్లకు చేరుకున్నాయి. 

ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 82,388 యూనిట్లుగా ఉంది. సెమికండక్టర్ల కొరత ప్రయాణికుల వాహన విభాగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 

మరిన్ని వార్తలు