ఈలాన్‌మస్క్‌ ఎక్కడ.. చైనా అప్పుడే మొదలెట్టింది!

30 Apr, 2022 04:10 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిటికలెస్తూ ట్విటర్‌ను క్షణాల్లో కొనేసిన ఈలాన్‌ మస్క్‌కి ఇప్పటికీ ఓ కోరిక అలాగే ఉండిపోయింది. టెస్లా కార్లలో ఆటోపైలెట్‌కి అనుమతి సాధించేందుకు ఏళ్ల తరబడి ఈలాన్‌ మస్క్‌ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశించిన ఫలితం పొందలేదు. మరోవైపు చైనా చాప కింద నీరులా ఈ పని చేసేసింది.

చైనాలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ సేవలు
ప్రపంచంలో తొలిసారిగా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో 100 రోబోట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్‌ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్‌ దక్కించుకుంది. అలాగే బీజింగ్‌ నగరంలోనూ సేవలు ఆఫర్‌ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్‌ దిగ్గజం బైడూ లైసెన్స్‌ పొందింది.

2021 నవంబరు..
బీజింగ్‌లో 67 అటానమస్‌ (డ్రైవర్‌ రహిత) వెహికిల్స్‌ పరీక్షల కోసం పోనీ.ఏఐ 2021 నవంబర్‌లో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 7,00,000 ట్రిప్స్‌ పూర్తి చేసింది. 80 శాతం రైడర్స్‌ పాత కస్టమర్లేనని కంపెనీ తెలిపింది. క్వాంజో నగరంలోని ఇతర ప్రాంతాలతోపాటు చైనాలో ప్రథమ శ్రేణి నగరాల్లోనూ రోబోట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి మొదలు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ అటానమస్‌ వాహనంలో డ్రైవర్‌ కూడా ఉంటారు. ఈ రెండు కంపెనీలూ రానున్న రోజుల్లో డ్రైవర్‌ లేకుండానే సేవలు అందించనున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన పోనీ.ఏఐ కంపెనీని జేమ్స్‌ హంగ్, టించెంగ్‌ లూహ్‌ 2016లో స్థాపించారు.

చదవండి: ‘దిగంతర’ స్పేస్‌ స్టార్టప్‌'.. ఇంజనీరింగ్ విద్యార్థుల సక్సెస్‌ స్టోరీ

మరిన్ని వార్తలు