ఈ యాప్‌లను వెంటనే తొలగించండి!

16 Nov, 2020 15:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. ప్రతి చిన్న అవసరానికి మనం ఎక్కువ శాతం మొబైల్ మీద ఆధారపడుతున్నాం. ఏ చిన్న సమస్యకైనా మనకు ఏదో ఒక యాప్ రూపంలో పరిష్కారం లభిస్తుంది. ఈ యాప్స్ ద్వారా మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలూ కూడా ఉన్నాయి. ప్లే స్టోర్ లో ఉండే ఈ యాప్స్ వల్ల మన ఫోన్ హ్యాకర్ల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సంస్థలు వాటి పేర్లను బహిర్గతం చేస్తున్నాయి.

తాజాగా, డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి. ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్‌లోడ్‌ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది. (చదవండి: పీవీసీ ఆధార్: రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌తో పనిలేదు)

వినియోగదారుల నుంచి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్ జాబితా ఇదే...

  • Skins, Mods, Maps for Minecraft PE
  • Skins for Roblox
  • Live Wallpapers HD & 3D Background
  • MasterCraft for Minecraft
  • Master for Minecraft
  • Boys and Girls Skins
  • Maps Skins and Mods for Minecraft
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు