DMart: సామాన్యుడినే కాదు..! డీమార్ట్‌ జోరుకు స్పీడ్‌ బ్రేకర్‌గా..!

9 Jan, 2022 14:02 IST|Sakshi

అధిక ద్రవ్యోల్భణ రేటుతో​ సామాన్యులే కాకుండా డీమార్ట్‌ కూడా కాస్త సతమతమైంది. డీమార్ట్‌ జోరుకు ద్రవ్యోల్భణం స్పీడ్‌ బ్రేకర్‌గా నిలిచింది. 2021 క్యూ3లో కంపెనీ తక్కువ లాభాలను గడించింది. 

ఆశించిన దాని కంటే..!
రిటైల్ చైన్ డీమార్ట్‌ ఆపరేటర్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్  (అక్టోబర్-డిసెంబర్) 2021 త్రైమాసికంలో ఊహించిన దాని కంటే తక్కువ లాభాలను నమోదు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కంపెనీ నికర లాభం వరుసగా 32శాతం పెరిగి రూ.552.53 కోట్లకు చేరుకుంది. క్యూ3లో డీమార్ట్‌ సుమారు రూ. 603 కోట్ల లాభాలను  బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వ్యాపారాన్ని దెబ్బతీసిందని డీమార్ట్‌ యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటీకి కంపెనీ మార్జిన్లకు అనుగుణంగా అంచనాలు కాస్త అటుఇటుగా ఉన్నాయని పేర్కొంది. 

గత ఏడాదితో పోలిస్తే..!
2020-21లో ఇదే కాలంలో లాభం రూ.446.05 కోట్లతో పోలిస్తే ఈసారి 23.62 శాతం పెరిగింది. ఇదే సమయంలో నిర్వహణ ఆదాయం రూ. 7542 కోట్ల నుంచి 22.22 శాతం పెరిగి రూ.9,217.76 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6977.88 కోట్ల నుంచి 21.72 శాతం పెరిగి  రూ.8,493.55 కోట్లకు చేరాయి.ఇదే సమయంలో నికర లాభం కూడా రూ.686 కోట్ల నుంచి రూ.1086 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.

అధిక ద్రవ్యోల్భణ ప్రభావాలు..!
ద్రవ్యోల్భణం కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నొరోన్హా అన్నారు. సాధారణ వస్తువులు, దుస్తుల వ్యాపారం స్థిరంగా ఉన్నాయని, అయితే నిత్యావసర వస్తువులు (ఎఫ్‌ఎమ్‌సీజీ) అమ్మకాలు నెమ్మదించాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆయా వస్తువులను పొదుపుగా వాడుతున్నట్లు అభిప్రాయపడ్డారు.  

చదవండి:  అప్పట్లో అందరి రాతలు ఆయన పెన్నులతోనే! ప్చ్‌.. ఆయన రాతే బాగోలేదు!

మరిన్ని వార్తలు