ఏవియేషన్‌ రంగంలో కొలువుల జాతర, లక్ష ఉద్యోగాలు భర్తీ

10 Aug, 2022 08:55 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో దేశీ విమానయాన రంగం .. మరో లక్ష మందికి ప్రత్యక్షంగా కొలువులు కల్పించే అవకాశాలు ఉన్నాయని పార్లమెంటరీ అంచనాల కమిటీకి కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఏవియేషన్, ఏరోనాటికల్‌ తయారీ రంగంలో సుమారు 2,50,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందున్నట్లు వివరించింది. వీరిలో పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, కార్గో, రిటైల్, సెక్యూరిటీ గార్డులు మొదలైన వారు ఉన్నారు.

ఈ సంఖ్య 2024 నాటికి 3,50,000కు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఏవియేషన్‌లో పరోక్ష, ప్రత్యక్ష ఉద్యోగాల నిష్పత్తి 4:8గా ఉన్నట్లు వివరించింది. లోక్‌సభకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

చదవండి👉 రాకేష్ ఝున్ ఝున్ వాలా..'ఆకాశ ఎయిర్' సేవలు షురూ!

మరిన్ని వార్తలు