హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్‌ భారీ పెట్టుబడులు, ఏడాదికి 48వేల ఉద్యోగాలు

22 Nov, 2022 11:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌లో అగ్రగామి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) రీజియన్‌ కార్యకలాపాలను ఆసియా పసిఫిక్ (హైదరాబాద్‌లో)  ఆవిష్కరించింది.   దేశంలో రెండవ మౌలిక సదుపాయాల ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌ను  మంగళవారం లాంచ్‌ చేసింది. రాబోయే ఎనిమిదేళ్లలో (2030) 4.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36,300 కోట్లు) పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. తద్వారా సంవత్సరానికి  48వేల ఫుల్‌టైం ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. అంతేకాదు 2030 నాటికి సుమారుగా 7.6 బిలియన్ల డాలర్ల మేర భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి  తోడ్పాటునిస్తుందని కూడా  భావిస్తున్నారు.   (బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు: మరోసారి బ్రేక్‌, ఎందుకంటే?)

హైదరాబాద్ రీజియన్ ప్రారంభండిజిటల్‌ ఇండియాకు మద్దతు ఇస్తుందని అమెజాన్ డేటా సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కళ్యాణరామన్ చెప్పారు. 2011లో తమ తొలి కార్యాలయాన్ని ప్రారంభించినప్పటి నుండి దేశంలో దీర్ఘకాలిక పెట్టుబడిలో భాగమని ఒక ప్రకటనలో తెలిపింది. డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సహా ఆవిష్కరణలను నడపడానికి కస్టమర్‌లు అధునాతన ఏడబ్ల్యూఎస్‌ టెక్నాలజీలకు యాక్సెస్‌ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.  (వాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్‌ ఫీచర్‌ ఇంకా...!)

ఇవీ చదవండి:Google Layoffs ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌: 10 వేలమంది ఇంటికే!

Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్‌: ఇండియన్‌ టెకీలకు గుడ్‌ న్యూస్‌

డేటా సెంటర్‌లను విస్తరణకు సంబంధించి ఏడబ్ల్యూఎస్‌ పెట్టుబడులను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్‌ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఇండియాకు సాధనకు ఇది ఖచ్చితంగా సహాయపడుతుందని అన్నారు. దేశంలో ప్రగతిశీల డేటాసెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేసేలా హైదరాబాద్‌లోని ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌లో సుమారు రూ. 36,300 కోట్ల పెట్టుబడులపై తెలంగాణా  ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు.  కాగా కంపెనీ తమ తొలి ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌ను 2016లో ముంబైలో ప్రారంభించింది.

మరిన్ని వార్తలు