యాక్సిస్‌ ఏఎంసీ 3,500 కోట్ల డి్రస్టెస్డ్‌ ఫండ్‌

25 Oct, 2021 04:30 IST|Sakshi

ముంబై: యాక్సిస్‌ ఏఎంసీ (మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ సంస్థ).. ఇన్వర్షన్‌ అడ్వైజరీ సర్విసెస్‌ భాగస్వామ్యంతో రూ.3,500 కోట్ల డి్రస్టెస్డ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీలను లాభాల్లోకి తీసుకురావడంలో (టర్న్‌అరౌండ్‌) నైపుణ్యం ఉన్న ఇన్వర్షన్‌ అడ్వైజరీ సర్విసెస్‌ (అఖిల్‌ గుప్తా ఏర్పాటు చేసిన సంస్థ)తో ఒక ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌ భాగస్వామ్యం కుదుర్చుకోవడం కొత్త తరహాగా యాక్సిస్‌ ఏఎంసీ పేర్కొంది.

సెబీ ఆమోదం అనంతరం రూ.3,500 కోట్లతో డి్రస్టెస్డ్‌ ఫండ్‌ను ప్రారంభిస్తామని.. అదనంగా మరో రూ.500 కోట్ల మేర గ్రీన్‌ షూ ఆప్షన్‌ ఉంటుందని తెలిపింది. పనితీరు సజావుగా లేని కంపెనీల్లో నియంత్రిత వాటాలను ఈ ఫండ్‌తో కొనుగోలు చేసి.. తదుపరి వాటి నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ద్వారా టర్న్‌అరౌండ్‌ చేస్తామని వివరించింది. ‘‘టర్న్‌అరౌండ్‌ పెట్టుబడుల విధానంలోకి అడుగు పెట్టడం ద్వారా దేశ వృద్ధి పథంలో పాల్గొని, ప్రయోజనం పొందే వినూత్న అవకాశాన్ని ఇన్వెస్టర్లకు తీసుకొచ్చాం’’ అని యాక్సిస్‌ ఏఎంసీ ఎండీ, సీఈవో చంద్రేష్‌ నిగమ్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు