‘యాక్సిస్‌’లో అవకతవకలు.. కీలక అధికారి తొలగింపు

19 May, 2022 12:06 IST|Sakshi

దేశంలోనే పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌లలో ఒకటైన యాక్సిస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫండ్‌ మేనేజ్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడ్డాడంటూ చీఫ్‌ డీలర్‌ను విధుల్లోంచి తొలగించింది యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ.

యాక్సిస్‌ సంస్థ దేశంలోనే దేశంలోనే ఏడో అతి పెద్ద మ్యూచువల్‌ఫండ్‌ సంస్థగా ఉంది. దీని పరిధిలో యాక్సిస్‌ ఆర్బిట్రేజ్‌ ఫండ్‌, యాక్సిస్‌ బ్యాంకింగ్‌ ఈటీఎఫ్‌, యాక్సిస్‌ నిఫ్టీ ఈటీఎఫ్‌, యాక్సిస్‌ టెక్నాలజీ ఈటీఎఫ్‌, యాక్సిస్‌ కన్‌సప్షన్‌ ఈటీఎఫ్‌ ఫండ్లకు మేనేజర్‌గా చీఫ్‌ డీలర్‌గా వీరేశ్‌ జోషి పని చేసేవారు. అయితే ఫండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఆయన అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

2022 ఫిబ్రవరిలో ఆరోపణలు చుట్టుముట్టగా.. అప్పటి నుంచి విచారన జరుగుతోంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టారు. చివరకు విచారణ నివేదిక ఆధారంగా వివేశ్‌జోషిని చీఫ్‌ డీలర్‌ పదవి నుంచి తప్పించడంతో పాటు మొత్తంగా యాక్సిస్‌ నుంచి తొలగించారు.

చదవండి: ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. ప్చ్‌! 

మరిన్ని వార్తలు