ఐటీసీతో యాక్సిస్‌ బ్యాంక్‌ జట్టు

11 Mar, 2023 04:53 IST|Sakshi

ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఆర్థిక సేవలు అందించే దిశగా పారిశ్రామిక దిగ్గజం ఐటీసీతో యాక్సిస్‌ బ్యాంక్‌ చేతులు కలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న రైతుల ఆర్థిక సర్వీసుల అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని తెలిపింది. రైతు రుణాలు, బంగారంపై రుణాలు మొదలైనవి అందించడానికి సాధ్యపడుతుందని పేర్కొంది.

ఐటీసీకి చెందిన ఐటీసీమార్స్‌ అనే అగ్రిటెక్‌ యాప్‌ ద్వారా రైతులకు చేరువ కానున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ వివరించింది. అలాగే 656 గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్‌ శాఖల ద్వారా విస్తృతమైన సాధనాలు, సర్వీసులు అందించగలమని యాక్సిస్‌ బ్యాంక్‌ భారత్‌ బ్యాంకింగ్‌ విభాగం హెడ్‌ మునీష్‌ సర్దా తెలిపారు. 40 లక్షల పైచిలుకు రైతులు తమ ఈ–చౌపల్‌ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారని ఐటీసీ అగ్రి బిజినెస్‌ విభాగం డివిజనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రజనీకాంత్‌ రాయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు