యాక్సిస్‌ ఫెస్టివల్‌ ఆఫర్‌: హోంలోన్స్‌పై 12 ఈఎంఐల మినహాయింపు

20 Oct, 2021 14:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ బ్యాంక్‌ యాక్సిస్‌..  దీపావళి పండుగ సందర్భంగా కొన్ని గృహ రుణాల పథకాలపై ప్రత్యేక ఆఫర్లు అందించనుంది. అంతేకాదు ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఎంపిక చేసిన హోమ్‌ లోన్‌ పథకాలపై 12 నెలసరి వాయిదాల (ఈఎంఐ) మినహాయింపుతో బంపరాఫర్‌ అందించింది. అంతేకాదు టూవీలర్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా ఆన్‌–రోడ్‌ ఖరీదు మొత్తాన్ని రుణంగా అందిస్తున్నట్లు బ్యాంక్‌  ప్రకటించింది. 


యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ పండుగ సీజన్‌కు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ‘దిల్‌ సే ఓపెన్‌ సెలబ్రేషన్స్‌: ఎందుకంటే ప్రతి రోజూ దీపావళి రాదు‘ పేరిట యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించింది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 స్థానిక దుకాణాదారుల నుంచి కొనుగోళ్లు జరిపితే 20 శాతం దాకా డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నట్లు, కాబట్టి కస్టమర్లు, యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాక్సిస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ సుమిత్‌ బాలి పిలుపు ఇచ్చారు.

చదవండి: యాక్సిస్‌ బ్యాంకుతో షాపింగ్‌ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్‌!

మరిన్ని వార్తలు