యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల బాట..

25 Jan, 2022 01:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లు జంప్‌ చేసి రూ. 3,973 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్‌ నికర లాభం సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 3,614 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,116 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17 శాతం పుంజుకుని రూ. 8,653 కోట్లకు చేరింది.   
ఫలితాల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 704 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు